(॥పల్లవి॥)
తా నేడ నే నేడ తడవి నన్ను
నానఁబెట్టి వట్టిమాట నయగారి గదవే
(॥తానేడ॥)
వచ్చి వచ్చి చూచేది వలపు మోచేది
బచ్చనల సటకాఁడు పాయఁడే నన్ను
కొచ్చి నడుము దూరేది గోరనే గీరేది
నిచ్చలు మానఁడు వీఁడు నేరుపరి గదవే
(॥తానేడ॥)
ఆసలనే పొనిఁగేది ఆచ్చలాన మునిఁగే ది
వాసులకు వెంట వెంట వచ్చీనే తాను
బాస లెల్ల నెరుపేది పను లెల్లా మరిపేది
కాసీఁ గూరిమియెండ కడు జాణ గదవే
(॥తానేడ॥)
కడు సిగ్గు విడిచేది కలికియై నడచేది
నడుమంత్రమున వీఁడు నవ్వీనే నన్ను
యెడలేక శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
అడియాలా లెల్ల నిచ్చె నందగాఁడు గదవే
(||pallavi||)
tā neḍa ne neḍa taḍavi nannu
nānam̐bĕṭṭi vaṭṭimāḍa nayagāri gadave
(||tāneḍa||)
vachchi vachchi sūsedi valabu mosedi
bachchanala saḍagām̐ḍu pāyam̐ḍe nannu
kŏchchi naḍumu dūredi gorane gīredi
nichchalu mānam̐ḍu vīm̐ḍu nerubari gadave
(||tāneḍa||)
āsalane pŏnim̐gedi āchchalāna munim̐ge di
vāsulagu vĕṁṭa vĕṁṭa vachchīne tānu
bāsa lĕlla nĕrubedi panu lĕllā maribedi
kāsīm̐ gūrimiyĕṁḍa kaḍu jāṇa gadave
(||tāneḍa||)
kaḍu siggu viḍisedi kaligiyai naḍasedi
naḍumaṁtramuna vīm̐ḍu navvīne nannu
yĕḍalega śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
aḍiyālā lĕlla nichchĕ naṁdagām̐ḍu gadave