తా నాడిన సరసము తనకు వెగ్గళ మైతే
(॥పల్లవి॥)
తా నాడిన సరసము తనకు వెగ్గళ మైతే
నే నేమి సేతునే యాల నెపాలు వేసీనే
(॥॥)
మొనలైన నా చన్నుల మొలకలు నాఁటె నంటా
కొన చూలపులఁ దా నెంత కొచ్చి చూచీనే
పెనఁగఁగా నా జడ ముప్పిరిఁ జుట్టుకొనె నంటా
వొనరఁ గఁదా నేల వురము దట్టీ నే
(॥॥)
చెవిలోని నా పుణుఁ గు చెక్కులపైఁ గారె నంటా
తావురుచుఁ దా నేల తిద్ద వచ్చీనే
యివల మోవులు సోఁకి యెంగిలాయ నంటాను
జవళి బొమ్మల నేల జంకించీనే
(॥॥)
కలసి కౌఁగిలించఁగా గాజు లొత్తె నంటాను
చలపట్టి తా నేల సాదించీనే
యెలమి శ్రీ వేంకటేశుఁడే నలమేలు మంగను
లలి నేలె నన్ను నెంత లాలించీనే
(||pallavi||)
tā nāḍina sarasamu tanagu vĕggaḽa maide
ne nemi sedune yāla nĕbālu vesīne
(||||)
mŏnalaina nā sannula mŏlagalu nām̐ṭĕ naṁṭā
kŏna sūlabulam̐ dā nĕṁta kŏchchi sūsīne
pĕnam̐gam̐gā nā jaḍa muppirim̐ juṭṭugŏnĕ naṁṭā
vŏnaram̐ gam̐dā nela vuramu daṭṭī ne
(||||)
sĕviloni nā puṇum̐ gu sĕkkulabaim̐ gārĕ naṁṭā
tāvurusum̐ dā nela tidda vachchīne
yivala movulu som̐ki yĕṁgilāya naṁṭānu
javaḽi bŏmmala nela jaṁkiṁchīne
(||||)
kalasi kaum̐giliṁcham̐gā gāju lŏttĕ naṁṭānu
salabaṭṭi tā nela sādiṁchīne
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍe nalamelu maṁganu
lali nelĕ nannu nĕṁta lāliṁchīne