చుట్టిచుట్టి మొగమేమి చూచేవు నీవు
(॥పల్లవి॥)
చుట్టిచుట్టి మొగమేమి చూచేవు నీవు
దిట్టవై నీలో నీవు దెలుసుకోరాదా
(॥చుట్టి॥)
మగఁడ వెంతసేసినా మచ్చరము నాకు లేదు
నగవు రాకమానదు నాసెలవికి
అగడు సేసితినంటా అందుకు నీవు దూరేవు
విగిడిన నీచేఁతలు నీవు మానరాదా
(॥చుట్టి॥)
కొంక కెవ్వతెఁ దెచ్చినా కోపము నాకు లేదు
జంకించక మానవు నాజంట బొమ్మలు
అంకెకత్తె నైతినంటా అప్పటి నుప్పతించేవు
సంకెదీరనీకునీవే సాదవు గారాదా
(॥చుట్టి॥)
వలపెందుకు జల్లినాను వైరము నాకు లేదు
సొలయకమానవు నాసూటిమాఁటలు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి గబ్బినంటా
తొలుతనే యీసుద్దులు తలపెట్టరాదా
(||pallavi||)
suṭṭisuṭṭi mŏgamemi sūsevu nīvu
diṭṭavai nīlo nīvu dĕlusugorādā
(||suṭṭi||)
magam̐ḍa vĕṁtasesinā machcharamu nāgu ledu
nagavu rāgamānadu nāsĕlavigi
agaḍu sesidinaṁṭā aṁdugu nīvu dūrevu
vigiḍina nīsem̐talu nīvu mānarādā
(||suṭṭi||)
kŏṁka kĕvvadĕm̐ dĕchchinā kobamu nāgu ledu
jaṁkiṁchaga mānavu nājaṁṭa bŏmmalu
aṁkĕgattĕ naidinaṁṭā appaḍi nuppadiṁchevu
saṁkĕdīranīgunīve sādavu gārādā
(||suṭṭi||)
valabĕṁdugu jallinānu vairamu nāgu ledu
sŏlayagamānavu nāsūḍimām̐ṭalu
yĕlami śhrīveṁkaḍeśha yelidivi gabbinaṁṭā
tŏludane yīsuddulu talabĕṭṭarādā