చుట్టరికే లుండఁగాను సూడులు వట్టఁగ నేల
(॥పల్లవి॥)
చుట్టరికే లుండఁగాను సూడులు వట్టఁగ నేల
జట్టిగొనే నీతోడి సరసమే మంచిది
(॥॥)
చెలులతో నీ సుద్దులు చెప్పేమంటే నెంత లేదు
యెలమి నా కోరికె లెంత లేదు
సులభుఁడవై నీవు చూచి నాతో నవ్వఁగాను
చలవాసి వలపులు చల్లుటే మంచిది
(॥॥)
కూరిములు సారె నిన్నుఁ గొసరఁగ నెంత లేదు
యేరుపడ నాపంతము లెంత లేదు
గారవించి నీవు నన్నుఁ గలయఁగ రాఁగాను
చేరి నీ యిచ్చకో లందిఁ జెనకుటే మంచిది
(॥॥)
పెనఁగి పెనఁగి నీతో బిగియఁగ నెంత లేదు
యెనగొన్న నాయాస లెంత లేదు
మనసిచ్చి యలమేలుమంగ శ్రీ వేంకటేశ్వర
మొనసి నన్నేలితివి మొక్కుటే మంచిది
(||pallavi||)
suṭṭarige luṁḍam̐gānu sūḍulu vaṭṭam̐ga nela
jaṭṭigŏne nīdoḍi sarasame maṁchidi
(||||)
sĕlulado nī suddulu sĕppemaṁṭe nĕṁta ledu
yĕlami nā korigĕ lĕṁta ledu
sulabhum̐ḍavai nīvu sūsi nādo navvam̐gānu
salavāsi valabulu salluḍe maṁchidi
(||||)
kūrimulu sārĕ ninnum̐ gŏsaram̐ga nĕṁta ledu
yerubaḍa nābaṁtamu lĕṁta ledu
gāraviṁchi nīvu nannum̐ galayam̐ga rām̐gānu
seri nī yichchago laṁdim̐ jĕnaguḍe maṁchidi
(||||)
pĕnam̐gi pĕnam̐gi nīdo bigiyam̐ga nĕṁta ledu
yĕnagŏnna nāyāsa lĕṁta ledu
manasichchi yalamelumaṁga śhrī veṁkaḍeśhvara
mŏnasi nannelidivi mŏkkuḍe maṁchidi