Suttarigamu seyamgaa sooduvatta nimkanela

చుట్టరికము సేయఁగా సూడువట్ట నిఁకనేల
Language

(॥పల్లవి॥)
చుట్టరికము సేయఁగా సూడువట్ట నిఁకనేల
గట్టిగాను ప్రియమెల్లాఁ గైకొందుఁగాక

(॥చుట్ట॥)
మొగము చూచి చూచి ముంచి యిందరిలోనాను
యెగసక్కెపుమాటలు యెట్టాడే నిన్ను
నగుతా నీవుండఁగాను నావొద్దికి రావనుచు
తెగువతో దూరి దూరి తిట్టి నెట్టువచ్చును

(॥చుట్టి॥)
నీవద్దనే కూచుండి నేరమిసేసితివంటా
కావరించి యెటువలెఁగసరే నిన్ను
చేవమీర నీవు నాపై సేసలు చల్లఁగానే
యీవలఁ దప్పించుకొంటా యేఁగనెట్టువచ్చును

(॥చుట్టి॥)
చెప్పినట్టు సేయఁగాను చిత్తములోఁ గరఁగక
చొప్పలెత్తి యెటువలె సొలతు నిన్ను
అప్పుడె శ్రీవేంకటేశ అలమేల్మంగ నాకుఁ
జెప్పి కూడితివి రట్టుసేయ నెట్టువచ్చును

(||pallavi||)
suṭṭarigamu seyam̐gā sūḍuvaṭṭa nim̐kanela
gaṭṭigānu priyamĕllām̐ gaigŏṁdum̐gāga

(||suṭṭa||)
mŏgamu sūsi sūsi muṁchi yiṁdarilonānu
yĕgasakkĕbumāḍalu yĕṭṭāḍe ninnu
nagudā nīvuṁḍam̐gānu nāvŏddigi rāvanusu
tĕguvado dūri dūri tiṭṭi nĕṭṭuvachchunu

(||suṭṭi||)
nīvaddane kūsuṁḍi neramisesidivaṁṭā
kāvariṁchi yĕḍuvalĕm̐gasare ninnu
sevamīra nīvu nābai sesalu sallam̐gāne
yīvalam̐ dappiṁchugŏṁṭā yem̐ganĕṭṭuvachchunu

(||suṭṭi||)
sĕppinaṭṭu seyam̐gānu sittamulom̐ garam̐gaga
sŏppalĕtti yĕḍuvalĕ sŏladu ninnu
appuḍĕ śhrīveṁkaḍeśha alamelmaṁga nāgum̐
jĕppi kūḍidivi raṭṭuseya nĕṭṭuvachchunu