చుట్టరికము సేసితే సూడువట్టేవా
(॥పల్లవి॥)
చుట్టరికము సేసితే సూడువట్టేవా
గుట్టుతో మాటాడితేను రట్టుసేసేవే
(॥చుట్ట॥)
కొప్పు దువ్వి నీ కాతఁడు గొజ్జంగలు ముడువఁగా
అప్పుడే గోరుదాఁ కెనంటా దేవే
గొప్పయినచన్నులపై కుంకుమపూయఁగాను
ముప్పిరిఁ బిసికెనంటా మోము వంచేవే
(॥చుట్ట॥)
వేఱె నిన్నతఁడు గారవించి సింగారించరాఁగా
జాఱించీఁ బోఁకముడెంటా జింకించేవే
మీఱినసొమ్ములెల్లా ని మెడనిండఁ బెట్టఁగాను
తూఱి కాఁగిలించేనంటా దూరుసేసేవే
(॥చుట్ట॥)
వొడివట్టి నిన్నతఁడు వురముపైఁ బెట్టుకోఁగా
నడుమఁ బెండ్లనంటా నవ్వు నవ్వేనే
అడరి శ్రీవేంకటేశుఁ డల మేలుమంగ నిన్ను
చిడుముడిఁ గూడెనంటా సిగ్గువడేవే
(||pallavi||)
suṭṭarigamu seside sūḍuvaṭṭevā
guṭṭudo māḍāḍidenu raṭṭuseseve
(||suṭṭa||)
kŏppu duvvi nī kādam̐ḍu gŏjjaṁgalu muḍuvam̐gā
appuḍe gorudām̐ kĕnaṁṭā deve
gŏppayinasannulabai kuṁkumabūyam̐gānu
muppirim̐ bisigĕnaṁṭā momu vaṁcheve
(||suṭṭa||)
veṟĕ ninnadam̐ḍu gāraviṁchi siṁgāriṁcharām̐gā
jāṟiṁchīm̐ bom̐kamuḍĕṁṭā jiṁkiṁcheve
mīṟinasŏmmulĕllā ni mĕḍaniṁḍam̐ bĕṭṭam̐gānu
tūṟi kām̐giliṁchenaṁṭā dūruseseve
(||suṭṭa||)
vŏḍivaṭṭi ninnadam̐ḍu vuramubaim̐ bĕṭṭugom̐gā
naḍumam̐ bĕṁḍlanaṁṭā navvu navvene
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍala melumaṁga ninnu
siḍumuḍim̐ gūḍĕnaṁṭā sigguvaḍeve