చుట్టరికమైనచోట సూడువట్టనేఁటికి
(॥పల్లవి॥)
చుట్టరికమైనచోట సూడువట్టనేఁటికి
గట్టియాయఁ బనులెల్లా కానిమ్మనవయ్యా
(॥చుట్ట॥)
చెక్కునొక్కి యాపె నిన్నుఁ జేరి వేఁడుకొనఁగాను
నిక్కనినవ్వుతోనేల సిగ్గువడేవు
వుక్కుమీరి యావేళ నిన్నొరసెనో కొనగోరు
ఇక్కడ నందుకేమియు నెంచవద్దు రావయ్య
(॥చుట్ట॥)
కోరి ప్రియమెల్లాం జెప్పి కొంగువట్టి పెనఁగఁగా
తేరకొననేల యాకె దిక్కుచూచేవు
అరీతులఁ దొక్కుతొక్కులాడఁగాఁ గాలు దాఁకెనో
సారె నందుకేమి దోసముగాదు రావయ్య
(॥చుట్ట॥)
అలమేలుమంగ నిన్ను నటు గాఁగిలించఁగాను
తలవంచుకొని లోలోఁ దమకించేవు
యెలమి శ్రీవేంకటేశ యిక్కువ లెంతసోఁకెనో
కలసితి రిఁకేమిఁ గొంకఁగవద్దు రావయ్య
(||pallavi||)
suṭṭarigamainasoḍa sūḍuvaṭṭanem̐ṭigi
gaṭṭiyāyam̐ banulĕllā kānimmanavayyā
(||suṭṭa||)
sĕkkunŏkki yābĕ ninnum̐ jeri vem̐ḍugŏnam̐gānu
nikkaninavvudonela sigguvaḍevu
vukkumīri yāveḽa ninnŏrasĕno kŏnagoru
ikkaḍa naṁdugemiyu nĕṁchavaddu rāvayya
(||suṭṭa||)
kori priyamĕllāṁ jĕppi kŏṁguvaṭṭi pĕnam̐gam̐gā
teragŏnanela yāgĕ dikkusūsevu
arīdulam̐ dŏkkudŏkkulāḍam̐gām̐ gālu dām̐kĕno
sārĕ naṁdugemi dosamugādu rāvayya
(||suṭṭa||)
alamelumaṁga ninnu naḍu gām̐giliṁcham̐gānu
talavaṁchugŏni lolom̐ damagiṁchevu
yĕlami śhrīveṁkaḍeśha yikkuva lĕṁtasom̐kĕno
kalasidi rim̐kemim̐ gŏṁkam̐gavaddu rāvayya