(॥పల్లవి॥)
చుట్టమువలెనే చూడవే
మెట్టుచుఁ బాదము మీఁద వేసీని
(॥చుట్టి॥)
వొద్దఁ గూచుండితే నొడివట్టుకొని
సుద్దులు చెప్పీఁ జూడవే
బద్దకుమంటే బాసలు సేసీ
పొద్దువోనివాఁడు బొదించీనే
(॥చుట్టి॥)
గేదంగి పూవిచ్చి కేలెత్తి మొక్కితే
జూదమాడుమనీఁ జూడవే
సాదవు గమ్మంటే సన్నలు చూపీని
వీదియెమ్మెకాఁడు వెంటవచ్చీనే
(॥చుట్టి॥)
గక్కున నేమెచ్చి కాఁగిలించుకొంటే
చొక్కఁగ ననుఁ గూడెఁ జూడవే
యిక్కడ శ్రీవేంకటేశుఁడు మెచ్చీని
కక్కసీఁడు మోవి గంటిరేచీఁనే
(||pallavi||)
suṭṭamuvalĕne sūḍave
mĕṭṭusum̐ bādamu mīm̐da vesīni
(||suṭṭi||)
vŏddam̐ gūsuṁḍide nŏḍivaṭṭugŏni
suddulu sĕppīm̐ jūḍave
baddagumaṁṭe bāsalu sesī
pŏdduvonivām̐ḍu bŏdiṁchīne
(||suṭṭi||)
gedaṁgi pūvichchi kelĕtti mŏkkide
jūdamāḍumanīm̐ jūḍave
sādavu gammaṁṭe sannalu sūbīni
vīdiyĕmmĕgām̐ḍu vĕṁṭavachchīne
(||suṭṭi||)
gakkuna nemĕchchi kām̐giliṁchugŏṁṭe
sŏkkam̐ga nanum̐ gūḍĕm̐ jūḍave
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ḍu mĕchchīni
kakkasīm̐ḍu movi gaṁṭiresīm̐ne