Suttamavu gaa vadani soodubamtavoom gaavu

చుట్టమవు గా వతని సూడుబంటవూఁ గావు
Language

(॥పల్లవి॥)
చుట్టమవు గా వతని సూడుబంటవూఁ గావు
ముట్టి వేఁడుకోఁ గాను మో మేల వంచేవే

(॥చుట్టమువు॥)
గుట్టు లేక ఆతఁడు నీ కొంగు వట్టి తీసీని
పట్టినచలము మాని పదవే నీకు
వుట్టిపడి నీ చెక్కు లుంగరాలచేత నొక్కె
బెట్టుగా నింతేసి యింకాఁ బెనఁగ నేమటికే

(॥చుట్టమవు॥)
గక్కన నవ్వుతా వచ్చి కదిసి కూచున్నాఁడు
వెక్కసపుకోప మింక విడవే నీవు
అక్కరఁ దనపై నీకు ఆన లెల్లఁ బెట్టె నదే
యిక్కడఁ దొల్లిటినేరా లెంచఁగ నేమిటికే

(॥చుట్ట॥)
కందువ లంటుచు నిన్ను కాఁగిలించె నాతఁడు
మందెమేళములు యింక మానవే నీవు
అందెంది శ్రీవెంకటేశుఁ డన్నటాను నిన్నుఁ గూడె
చంద మాయఁ బను లెల్ల సాదించ నేమిటికే

(||pallavi||)
suṭṭamavu gā vadani sūḍubaṁṭavūm̐ gāvu
muṭṭi vem̐ḍugom̐ gānu mo mela vaṁcheve

(||suṭṭamuvu||)
guṭṭu lega ādam̐ḍu nī kŏṁgu vaṭṭi tīsīni
paṭṭinasalamu māni padave nīgu
vuṭṭibaḍi nī sĕkku luṁgarālaseda nŏkkĕ
bĕṭṭugā niṁtesi yiṁkām̐ bĕnam̐ga nemaḍige

(||suṭṭamavu||)
gakkana navvudā vachchi kadisi kūsunnām̐ḍu
vĕkkasabugoba miṁka viḍave nīvu
akkaram̐ danabai nīgu āna lĕllam̐ bĕṭṭĕ nade
yikkaḍam̐ dŏlliḍinerā lĕṁcham̐ga nemiḍige

(||suṭṭa||)
kaṁduva laṁṭusu ninnu kām̐giliṁchĕ nādam̐ḍu
maṁdĕmeḽamulu yiṁka mānave nīvu
aṁdĕṁdi śhrīvĕṁkaḍeśhum̐ ḍannaḍānu ninnum̐ gūḍĕ
saṁda māyam̐ banu lĕlla sādiṁcha nemiḍige