Suttamavamtaa ninnum joosidim gaaga yee

చుట్టమవంటా నిన్నుఁ జూచితిఁ గాక యీ
Language

(॥పల్లవి॥)
చుట్టమవంటా నిన్నుఁ జూచితిఁ గాక యీ-
వెట్టిమోహ మెరిఁగితే వెఱపుతోనుండనా

(॥చుట్ట॥)
పంతమిచ్చేఁ గోరా పదరి నిన్నిందరిలో
అంతలేసిమాటలు నే నాడినందుకు
యింతలోనే నీవిందు నెగ్గుపట్టేదెరిఁగితే
మంతనాన దీవించి మాయింటనే వుండనా

(॥చుట్ట॥)
మిక్కిలి మొక్కేలేరా మెరయ నీకాలు దొక్కి
చిక్కించి నిన్నుఁ దుచ్చము సేసినందుకు
వెక్కసమై నీకిది వేసటయ్యే దెరిఁగితే
తక్కక నాలో నేనే తలవంచుకుండనా

(॥చుట్ట॥)
కాఁగిలించే లేరా కమ్మవిరులచెండున
వీఁగకు నీమేను దాఁక వేసినందుకు
చేఁగదేరఁ గూడితివి శ్రీవేంకటేశుఁడ నన్ను
పాఁగి యీతమకమైతే పైపైనే వుండునా

(||pallavi||)
suṭṭamavaṁṭā ninnum̐ jūsidim̐ gāga yī-
vĕṭṭimoha mĕrim̐gide vĕṟabudonuṁḍanā

(||suṭṭa||)
paṁtamichchem̐ gorā padari ninniṁdarilo
aṁtalesimāḍalu ne nāḍinaṁdugu
yiṁtalone nīviṁdu nĕggubaṭṭedĕrim̐gide
maṁtanāna dīviṁchi māyiṁṭane vuṁḍanā

(||suṭṭa||)
mikkili mŏkkelerā mĕraya nīgālu dŏkki
sikkiṁchi ninnum̐ duchchamu sesinaṁdugu
vĕkkasamai nīgidi vesaḍayye dĕrim̐gide
takkaga nālo nene talavaṁchuguṁḍanā

(||suṭṭa||)
kām̐giliṁche lerā kammavirulasĕṁḍuna
vīm̐gagu nīmenu dām̐ka vesinaṁdugu
sem̐gaderam̐ gūḍidivi śhrīveṁkaḍeśhum̐ḍa nannu
pām̐gi yīdamagamaide paibaine vuṁḍunā