చుట్టమవై వున్నాఁడవు చూచినవారికిఁ జూడ
(॥పల్లవి॥)
చుట్టమవై వున్నాఁడవు చూచినవారికిఁ జూడ
తొట్టుదీరిచేవు యింత దోసమేల యిఁకను
(॥చుట్టి॥)
చేరి నాపైఁ జేయి వేసి సెలవినే నవ్వు నవ్వి
మేరమీరినందుకే పో మెస్తిరా నిన్ను
వోరి నీ విందాఁక నెందోవుండి వచ్చి యిదీనొక్క
దూరు గట్టేవా వట్టి దోసమేల యిఁకను
(॥చుట్టి॥)
చల్లనిచూపులఁ జూచి సరసపుమాటలాడి
మెల్లనె వొడి వట్టేవు మెస్తిరా నిన్ను
తెల్లవారఁగా వచ్చి తెగి యానలు వెట్టేవు
తొల్లిటి బాసలే చాలు దోసమేల యిఁకను
(॥చుట్టి॥)
వెట్టి వలపులు చల్లి విరులచెండున వేసి
మెట్టేవు నాపాదము మెస్తిరా నిన్ను
గుట్టున శ్రీవేంకటేశ కూడితివి నన్నునిట్టె
తొట్టి నిన్ను వెంగమాడేదోసమేల యిఁకను
(||pallavi||)
suṭṭamavai vunnām̐ḍavu sūsinavārigim̐ jūḍa
tŏṭṭudīrisevu yiṁta dosamela yim̐kanu
(||suṭṭi||)
seri nābaim̐ jeyi vesi sĕlavine navvu navvi
meramīrinaṁduge po mĕstirā ninnu
vori nī viṁdām̐ka nĕṁdovuṁḍi vachchi yidīnŏkka
dūru gaṭṭevā vaṭṭi dosamela yim̐kanu
(||suṭṭi||)
sallanisūbulam̐ jūsi sarasabumāḍalāḍi
mĕllanĕ vŏḍi vaṭṭevu mĕstirā ninnu
tĕllavāram̐gā vachchi tĕgi yānalu vĕṭṭevu
tŏlliḍi bāsale sālu dosamela yim̐kanu
(||suṭṭi||)
vĕṭṭi valabulu salli virulasĕṁḍuna vesi
mĕṭṭevu nābādamu mĕstirā ninnu
guṭṭuna śhrīveṁkaḍeśha kūḍidivi nannuniṭṭĕ
tŏṭṭi ninnu vĕṁgamāḍedosamela yim̐kanu