చుట్టమైతే యాతనికి జోడై వుందువుగాక
(॥పల్లవి॥)
చుట్టమైతే యాతనికి జోడై వుందువుగాక
జట్టి గొని ఇఁకనేమి సాదించేవే
(॥చుట్ట॥)
యెదుటఁ చిత్తమురానే యిచ్చకమాడుదుగాని
పదరి మాటాడకువే పలుమారును
మొదలఁ బదారువేలసుదతులవాఁ డతఁడు
వెదకి నీ విఁకనేమి వెంగెమాడేవే
(॥చుట్ట॥)
సెలవుల నవ్వుతానే సేవలు సేతువు గాని
మలసి చేచాఁచకువే మాటిమాటికి
తలఁకక చీఁకటి తప్పు చేసేవాఁ డతఁడు
చలపట్టి యిఁకనేమి చక్కఁ బెట్టేవే
(॥చుట్ట॥)
కైవసమై నీ విట్టె కాఁగిటఁ గూడుదు గాని
చేవమీరి యిఁక రట్టు సేయకువే
శ్రీవేంకటేశుఁడు సర్వ జీవాంతరాత్మకుఁడు
దేవులవు యిఁకనేమి తిద్దుకొనేవే
(||pallavi||)
suṭṭamaide yādanigi joḍai vuṁduvugāga
jaṭṭi gŏni im̐kanemi sādiṁcheve
(||suṭṭa||)
yĕduḍam̐ sittamurāne yichchagamāḍudugāni
padari māḍāḍaguve palumārunu
mŏdalam̐ badāruvelasudadulavām̐ ḍadam̐ḍu
vĕdagi nī vim̐kanemi vĕṁgĕmāḍeve
(||suṭṭa||)
sĕlavula navvudāne sevalu seduvu gāni
malasi sesām̐saguve māḍimāḍigi
talam̐kaga sīm̐kaḍi tappu sesevām̐ ḍadam̐ḍu
salabaṭṭi yim̐kanemi sakkam̐ bĕṭṭeve
(||suṭṭa||)
kaivasamai nī viṭṭĕ kām̐giḍam̐ gūḍudu gāni
sevamīri yim̐ka raṭṭu seyaguve
śhrīveṁkaḍeśhum̐ḍu sarva jīvāṁtarātmagum̐ḍu
devulavu yim̐kanemi tiddugŏneve