Suttamai yaadamdu raamgaa sooduvatteve

చుట్టమై యాతఁడు రాఁగా సూడువట్టేవే
Language

(॥పల్లవి॥)
చుట్టమై యాతఁడు రాఁగా సూడువట్టేవే
చెట్టవట్టి తియ్యఁగాను సిగ్గువడేవే

(॥చుట్ట॥)
పాటించి యీతఁడు నీకు బాసలెల్లాఁ జేయఁగాను
నీటుతో నీవేమిటికి నిందలాడేవే
చీటికిమాటి కాతఁడు చేయివట్టి తియ్యంగాను
నాఁటఁజూచి యేమిటి కానలువెట్టేవే

(॥చుట్ట॥)
గుట్టుతో ముందర పతి కొండవలె నుండఁగాను
దిట్టతనముననేల తిట్టుదిట్టేవే
బెట్టుగాఁ జేరఁబిలిచి ప్రియములుచెప్పఁగాను
వుట్టిపడి నీవేల వొపననేవే

(॥చుట్ట॥)
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిన్నుఁ గూడఁగాను
కావరించి నీవేల కాఁతాళించేవే
మోవి యీతఁడే నీకు ముందరనే యియ్యంగాను
చేవమీద నేల గంటిసేసిచూపేవే

(||pallavi||)
suṭṭamai yādam̐ḍu rām̐gā sūḍuvaṭṭeve
sĕṭṭavaṭṭi tiyyam̐gānu sigguvaḍeve

(||suṭṭa||)
pāḍiṁchi yīdam̐ḍu nīgu bāsalĕllām̐ jeyam̐gānu
nīḍudo nīvemiḍigi niṁdalāḍeve
sīḍigimāḍi kādam̐ḍu seyivaṭṭi tiyyaṁgānu
nām̐ṭam̐jūsi yemiḍi kānaluvĕṭṭeve

(||suṭṭa||)
guṭṭudo muṁdara padi kŏṁḍavalĕ nuṁḍam̐gānu
diṭṭadanamunanela tiṭṭudiṭṭeve
bĕṭṭugām̐ jeram̐bilisi priyamulusĕppam̐gānu
vuṭṭibaḍi nīvela vŏbananeve

(||suṭṭa||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu seri ninnum̐ gūḍam̐gānu
kāvariṁchi nīvela kām̐tāḽiṁcheve
movi yīdam̐ḍe nīgu muṁdarane yiyyaṁgānu
sevamīda nela gaṁṭisesisūbeve