చుట్టపువరుస నన్నీఁ జూచేము గాక
(॥పల్లవి॥)
చుట్టపువరుస నన్నీఁ జూచేము గాక
యెట్టైనానాయ నిన్ను నేమనేమయ్యా
(॥చుట్టి॥)
చెయ్యార నీసేసినట్టి చేఁతలైతేఁ జెప్పరావు
తియ్యని నీ మాటలైతే తేనె గారీని
కొయ్యతనపు విభుఁడ కొంగువట్టి తీసేవు
యియ్యడ నీతో నిఁక నేమనేమయ్యా
(॥చుట్టి॥)
తక్కరి నీ గుణములు తలఁచ నలవిగావు
పక్కన నీనవ్వులైతే పాలు గారీని
వెక్కసపు రమణుఁడ వేడుకకాఁడవు నీవు
యెక్కుడు పంతగాఁడవు యేమనేమయ్యా
(॥చుట్టి॥)
చేవదేరే నీ కాఁగిటఁ జిత్తడి చెమట నిండె
కేవలమై మోవినే చక్కెర గారీని
శ్రీ వేంకటేశుఁడవు చేరి నన్నుఁ గూడితివి
యీవిధవు నిన్నుఁజూచి యేమనేమయ్యా
(||pallavi||)
suṭṭabuvarusa nannīm̐ jūsemu gāga
yĕṭṭainānāya ninnu nemanemayyā
(||suṭṭi||)
sĕyyāra nīsesinaṭṭi sem̐talaidem̐ jĕpparāvu
tiyyani nī māḍalaide tenĕ gārīni
kŏyyadanabu vibhum̐ḍa kŏṁguvaṭṭi tīsevu
yiyyaḍa nīdo nim̐ka nemanemayyā
(||suṭṭi||)
takkari nī guṇamulu talam̐sa nalavigāvu
pakkana nīnavvulaide pālu gārīni
vĕkkasabu ramaṇum̐ḍa veḍugagām̐ḍavu nīvu
yĕkkuḍu paṁtagām̐ḍavu yemanemayyā
(||suṭṭi||)
sevadere nī kām̐giḍam̐ jittaḍi sĕmaḍa niṁḍĕ
kevalamai movine sakkĕra gārīni
śhrī veṁkaḍeśhum̐ḍavu seri nannum̐ gūḍidivi
yīvidhavu ninnum̐jūsi yemanemayyā