Suttabu varusalane sobanagaalamu vachche

చుట్టపు వరుసలనే సోబనకాలము వచ్చె
Language

(॥పల్లవి॥)
చుట్టపు వరుసలనే సోబనకాలము వచ్చె
యిట్టె కలకాలము నేలుకొనవయ్యా

(॥చుట్ట॥)
వెలఁదికి విరహపువేసఁగికాలము వచ్చె
కెలిగె నిట్టూర్పుల గాలికాలము
వలపులచెమటల వానకాలమును మించె
యెల యింపు లిఁకనేల ఇంటికి రావయ్యా

(॥చుట్ట॥)
పడఁతి మై పులకల పైరు కాలము వచ్చె
కడుఁగోరికల మంచుఁగాలము మీరె
అడరి యెడమాఁటల ఆమనికాలమూఁ గూడె
తడవుసేయక యట్టె దయఁ జూడవయ్యా

(॥చుట్టు॥)
సతి రతి చెనకుల జాజరకాలుము వచ్చె
కతలై నవ్వు వెన్నెలకాలమూ రేఁగె
తతిఁ గూడితివి యీకెఁ దగ శ్రీవేంకటేశ్వర
సతమై యీలాగులఁ జనవియ్యవయ్యా

(||pallavi||)
suṭṭabu varusalane sobanagālamu vachchĕ
yiṭṭĕ kalagālamu nelugŏnavayyā

(||suṭṭa||)
vĕlam̐digi virahabuvesam̐gigālamu vachchĕ
kĕligĕ niṭṭūrbula gāligālamu
valabulasĕmaḍala vānagālamunu miṁchĕ
yĕla yiṁpu lim̐kanela iṁṭigi rāvayyā

(||suṭṭa||)
paḍam̐ti mai pulagala pairu kālamu vachchĕ
kaḍum̐gorigala maṁchum̐gālamu mīrĕ
aḍari yĕḍamām̐ṭala āmanigālamūm̐ gūḍĕ
taḍavuseyaga yaṭṭĕ dayam̐ jūḍavayyā

(||suṭṭu||)
sadi radi sĕnagula jājaragālumu vachchĕ
kadalai navvu vĕnnĕlagālamū rem̐gĕ
tadim̐ gūḍidivi yīgĕm̐ daga śhrīveṁkaḍeśhvara
sadamai yīlāgulam̐ janaviyyavayyā