చుట్టపు వరుస నన్నీ సుదతి సింగారమాయ
(॥పల్లవి॥)
చుట్టపు వరుస నన్నీ సుదతి సింగారమాయ
దట్టమై యొకటి కొకటి దాపులాయఁ గదవే
(॥చుట్ట॥)
తొలుతనే సతి మోవి దొండపండై యుండఁగాను
పలుకుఁ జిలుక లందు పరఁగుఁగదే
తళుకుఁ గన్నులు మంచి తామరలై వుండఁగాను
అలరు నెరిఁ దుమ్మిద లమరుఁగదే
(॥చుట్ట॥)
సరసనే నెమ్మోము చెందురుఁడై వుండఁగాను
గరిమ నవ్వు వెన్నెలఁ గాయు గదవే
గురు కుచుములు పెద్దకొండలై వుండఁగాను
సిరుల నడు మనేటి సింహము చేరుగదే
(॥చుట్ట॥)
కడలేని యీకె మేను కనకమై వుండఁగాను
వుడివోని మించు వన్నె లుండుఁగదవే
జడియక పిరుఁ దిది చక్రమై వుండఁగాను
బడి శ్రీవేంకటేశుఁడు పట్టుకండుఁగదవే
(||pallavi||)
suṭṭabu varusa nannī sudadi siṁgāramāya
daṭṭamai yŏgaḍi kŏgaḍi dābulāyam̐ gadave
(||suṭṭa||)
tŏludane sadi movi dŏṁḍabaṁḍai yuṁḍam̐gānu
palugum̐ jiluga laṁdu param̐gum̐gade
taḽugum̐ gannulu maṁchi tāmaralai vuṁḍam̐gānu
alaru nĕrim̐ dummida lamarum̐gade
(||suṭṭa||)
sarasane nĕmmomu sĕṁdurum̐ḍai vuṁḍam̐gānu
garima navvu vĕnnĕlam̐ gāyu gadave
guru kusumulu pĕddagŏṁḍalai vuṁḍam̐gānu
sirula naḍu maneḍi siṁhamu serugade
(||suṭṭa||)
kaḍaleni yīgĕ menu kanagamai vuṁḍam̐gānu
vuḍivoni miṁchu vannĕ luṁḍum̐gadave
jaḍiyaga pirum̐ didi sakramai vuṁḍam̐gānu
baḍi śhrīveṁkaḍeśhum̐ḍu paṭṭugaṁḍum̐gadave