(॥పల్లవి॥)
సురలకు నరులకు శుభమాయె
హరి నీ చేఁతలు ఆనంద మాయె
(॥సురల॥)
కినిసి రావణుని గెలిచిన గెలుపులు
చెనకి బాణుని గెలిచిన గెలుపు
పొనిఁగి హేమకశిపుని గెలిచినగెలుపు
వెనక ముందరికి వేదము లాయె
(॥సురల॥)
కలన కంసునటు గెలిచినగెలుపులు
చెలఁగి బలిని గెలిచినగెలుపు
అలశిశుపాలుని గెలిచినగెలుపులు
బలుపుణ్యకథా భారతమాయె
(॥సురల॥)
కెరలి యసురలను గెలిచినగెలుపులు
సిరుల నందరి గెలిచినగెలుపు
యిరవగు శ్రీవేంకటేశ నీ మహిమలు
సరవితోఁ బురాణము లాయె
(||pallavi||)
suralagu narulagu śhubhamāyĕ
hari nī sem̐talu ānaṁda māyĕ
(||surala||)
kinisi rāvaṇuni gĕlisina gĕlubulu
sĕnagi bāṇuni gĕlisina gĕlubu
pŏnim̐gi hemagaśhibuni gĕlisinagĕlubu
vĕnaga muṁdarigi vedamu lāyĕ
(||surala||)
kalana kaṁsunaḍu gĕlisinagĕlubulu
sĕlam̐gi balini gĕlisinagĕlubu
alaśhiśhubāluni gĕlisinagĕlubulu
balubuṇyagathā bhāradamāyĕ
(||surala||)
kĕrali yasuralanu gĕlisinagĕlubulu
sirula naṁdari gĕlisinagĕlubu
yiravagu śhrīveṁkaḍeśha nī mahimalu
saravidom̐ burāṇamu lāyĕ