సులభమున నున్నది సుజ్ఞానము
(॥పల్లవి॥)
సులభమున నున్నది సుజ్ఞానము
కలఁ దన్నవారికి కామనిధానమవు
(॥సుల॥)
విరసించి వెఱచితే వెంటఁ బెట్టు భూతములు
పరగ నీవైతే నభయ మిత్తువు
కెరలి భక్తి సేసితేఁ గిందుపరతు రింతులు
అరసి నీవైతే నీయంతవానిఁ జేతువు
(॥సుల॥)
బంటులైనవారిఁ గంటే పనిసేయింతు రేలికె
లంటివారి భారము నీవైతే మోతువు
జంట మొక్కేవారిఁ గంటే చౌక సేతు రితరులు
కంటులేక నీవైతే ఘనులఁగాఁ జేతువు
(॥సుల॥)
వినయపువారిఁ గంటే వేసరుదురు దొరలు
అనిశము నీ రయితే నాదరింతువు
వొనర శ్రీవేంకటేశ వొద్దిక నీ దాసులు
కనుఁగొని నమ్మితేను కరుణింతువు
(||pallavi||)
sulabhamuna nunnadi sujñānamu
kalam̐ dannavārigi kāmanidhānamavu
(||sula||)
virasiṁchi vĕṟaside vĕṁṭam̐ bĕṭṭu bhūdamulu
paraga nīvaide nabhaya mittuvu
kĕrali bhakti sesidem̐ giṁdubaradu riṁtulu
arasi nīvaide nīyaṁtavānim̐ jeduvu
(||sula||)
baṁṭulainavārim̐ gaṁṭe paniseyiṁtu religĕ
laṁṭivāri bhāramu nīvaide moduvu
jaṁṭa mŏkkevārim̐ gaṁṭe sauga sedu ridarulu
kaṁṭulega nīvaide ghanulam̐gām̐ jeduvu
(||sula||)
vinayabuvārim̐ gaṁṭe vesaruduru dŏralu
aniśhamu nī rayide nādariṁtuvu
vŏnara śhrīveṁkaḍeśha vŏddiga nī dāsulu
kanum̐gŏni nammidenu karuṇiṁtuvu