సులభము యిదియే చూచిన దుర్లభ మిదే
(॥పల్లవి॥)
సులభము యిదియే చూచిన దుర్లభ మిదే
అలరు సుజ్ఞానులకు అజ్ఞానులకు
(॥సుల॥)
తీఱుఁ గొన్నాళ్ళకు తెగిన దానఫలము
తీఱవు హరిదాసుల దివ్యభోగాలు
జాఱుఁ గొన్నాళ్ళకు సకల దేవత్వములు
జాఱదు వైకుంఠుని సాలోక్య మోక్షము
(॥సుల॥)
యింతింతనఁగవచ్చు నింద్రాదుల సంపదలు
యింతనరాదు నీ దాసుల యీ మహామహిమ
పంతాన సాధించవచ్చు బహుకర్మతపములు
యెంతైన సాధించరాదు యీ హరిభక్తి
(॥సుల॥)
వుండు తామస గుణము లొక్కొక్క సమయములు
వుండవు శ్రీవైష్ణవులవద్ద నెన్నఁడు
అండనె శ్రీ వేంకటేశుఁ డన్ని మాయలుఁ జూపు
నిండు తనదాసులకు నిజమాయె మాకు
(||pallavi||)
sulabhamu yidiye sūsina durlabha mide
alaru sujñānulagu ajñānulagu
(||sula||)
tīṟum̐ gŏnnāḽḽagu tĕgina dānaphalamu
tīṟavu haridāsula divyabhogālu
jāṟum̐ gŏnnāḽḽagu sagala devatvamulu
jāṟadu vaiguṁṭhuni sālokya mokṣhamu
(||sula||)
yiṁtiṁtanam̐gavachchu niṁdrādula saṁpadalu
yiṁtanarādu nī dāsula yī mahāmahima
paṁtāna sādhiṁchavachchu bahugarmadabamulu
yĕṁtaina sādhiṁcharādu yī haribhakti
(||sula||)
vuṁḍu tāmasa guṇamu lŏkkŏkka samayamulu
vuṁḍavu śhrīvaiṣhṇavulavadda nĕnnam̐ḍu
aṁḍanĕ śhrī veṁkaḍeśhum̐ ḍanni māyalum̐ jūbu
niṁḍu tanadāsulagu nijamāyĕ māgu