Sukkalu meraseeni sooryum demdalu gaasee

చుక్కలు మెరసీని సూర్యుఁ డెండలు గాసీ
Language

(॥పల్లవి॥)
చుక్కలు మెరసీని సూర్యుఁ డెండలు గాసీ
తక్కులు మొక్కులు మాని దగ్గరి రారా

(॥చుక్క॥)
నానీనాననినీనాలి మాటలు నా-
వీనులు సోఁకినంత వెచ్చనాయరా
కానీకానీ నీకడమలెల్లా
తానే మెచ్చయ్యీఁగాని దగ్గరి రారా

(॥చుక్క॥)
వీడీ వీడనినీవింతనవ్వులు నా-
వాడికమతిఁ గాఁడి వాండ్లాయరా
జోడుగూడిన నిన్నీ జోకలయ్యీని మరు -
దాడి ముట్టకతొల్లె దగ్గరి రారా

(॥చుక్క॥)
పాసీపాయనినీపన్నుఁ గాఁగిలి
రాసి నాకుచములు రవ్వాయరా
ఆసల శ్రీవేంకటాధిప నేను వలపు
తాసునఁ దూచేఁగాని దగ్గరి రారా

(||pallavi||)
sukkalu mĕrasīni sūryum̐ ḍĕṁḍalu gāsī
takkulu mŏkkulu māni daggari rārā

(||sukka||)
nānīnānaninīnāli māḍalu nā-
vīnulu som̐kinaṁta vĕchchanāyarā
kānīgānī nīgaḍamalĕllā
tāne mĕchchayyīm̐gāni daggari rārā

(||sukka||)
vīḍī vīḍaninīviṁtanavvulu nā-
vāḍigamadim̐ gām̐ḍi vāṁḍlāyarā
joḍugūḍina ninnī jogalayyīni maru -
dāḍi muṭṭagadŏllĕ daggari rārā

(||sukka||)
pāsībāyaninībannum̐ gām̐gili
rāsi nāgusamulu ravvāyarā
āsala śhrīveṁkaḍādhiba nenu valabu
tāsunam̐ dūsem̐gāni daggari rārā