సుద్దులేమి యడిగేవు చూచిచూచి నవ్వుకొంటా
(॥పల్లవి॥)
సుద్దులేమి యడిగేవు చూచిచూచి నవ్వుకొంటా
పొద్దువొద్దు లాలించి బుజ్జగింతువు గాక
(॥ద్దు॥)
సిగ్గువడివున్న యట్టిచెలియ నిన్నేమనీని
యెగ్గుపట్టనేరనిది యేమనీని
వొగ్గి నీకె జవ్వనము వొడిగట్టి యేమనీని
అగ్గమై నీవే మాటాడి యాదరింతువుగాక
(॥ద్దు॥)
మిగులా వలచినట్టిమెలుఁత నిన్నేమనీని
యెగసక్కెమాడ విది యేమనీని
మొగము చూచి నీకు మొక్కుచున్న దేమీనీని
మగఁడవై నీవిన్నిటా మన్నింతువుగాక
(॥ద్దు॥)
మచ్చికైనయలమేలుమంగ నిన్నేమనీని
యిచ్చకురాలైనది యేమనీని
పచ్చిగా నీకాఁగిటిలో పాయకున్న దేమనీని
యిచ్చట శ్రీవేంకటేశ యేలుదువుగాక
(||pallavi||)
suddulemi yaḍigevu sūsisūsi navvugŏṁṭā
pŏdduvŏddu lāliṁchi bujjagiṁtuvu gāga
(||ddu||)
sigguvaḍivunna yaṭṭisĕliya ninnemanīni
yĕggubaṭṭaneranidi yemanīni
vŏggi nīgĕ javvanamu vŏḍigaṭṭi yemanīni
aggamai nīve māḍāḍi yādariṁtuvugāga
(||ddu||)
migulā valasinaṭṭimĕlum̐ta ninnemanīni
yĕgasakkĕmāḍa vidi yemanīni
mŏgamu sūsi nīgu mŏkkusunna demīnīni
magam̐ḍavai nīvinniḍā manniṁtuvugāga
(||ddu||)
machchigainayalamelumaṁga ninnemanīni
yichchagurālainadi yemanīni
pachchigā nīgām̐giḍilo pāyagunna demanīni
yichchaḍa śhrīveṁkaḍeśha yeluduvugāga