(॥పల్లవి॥)
సుదతులకితనికి సోబనవేళ
వుదుటునఁ జెలులెల్ల నూడిగాలు శాయరే
(॥దతు॥)
ఇద్దరు పెండ్లికూఁతులకితఁడు గట్టె బాసిక-
మొద్దికఁ గప్పురవీడే లొడిఁబెట్టెను
పెద్దరికాన నడుమఁ బెండ్లిపఁటపైఁ గూచుండె
వొద్దనుండి సతులెల్ల నూడిగాలు సేయరే
(॥దతు॥)
రెండుచేతుల శాసలు రెట్టించి చల్లఁ దొడఁగె
దండలిద్దరిమెడలఁ దగుల వేసె
గండుమీరి ముంజేతులఁ గంకణదారాలు గట్టె
వుండినట్టే చెలులెల్ల నూడిగాలు సేయరే
(॥దతు॥)
భూమి నలమేల్మంగను భూసతిఁ గాఁగిటఁ గూడె
దోమటిదొడికి ముందే తొక్కెఁ బాదాలు
యీమేఁటి శ్రీవేంకటేశుఁ డిన్నివిధాల మెఱసె
వోముచును చెలులెల్ల నూడిగాలు సేయరే
(||pallavi||)
sudadulagidanigi sobanaveḽa
vuduḍunam̐ jĕlulĕlla nūḍigālu śhāyare
(||dadu||)
iddaru pĕṁḍligūm̐tulagidam̐ḍu gaṭṭĕ bāsiga-
mŏddigam̐ gappuravīḍe lŏḍim̐bĕṭṭĕnu
pĕddarigāna naḍumam̐ bĕṁḍlibam̐ṭabaim̐ gūsuṁḍĕ
vŏddanuṁḍi sadulĕlla nūḍigālu seyare
(||dadu||)
rĕṁḍusedula śhāsalu rĕṭṭiṁchi sallam̐ dŏḍam̐gĕ
daṁḍaliddarimĕḍalam̐ dagula vesĕ
gaṁḍumīri muṁjedulam̐ gaṁkaṇadārālu gaṭṭĕ
vuṁḍinaṭṭe sĕlulĕlla nūḍigālu seyare
(||dadu||)
bhūmi nalamelmaṁganu bhūsadim̐ gām̐giḍam̐ gūḍĕ
domaḍidŏḍigi muṁde tŏkkĕm̐ bādālu
yīmem̐ṭi śhrīveṁkaḍeśhum̐ ḍinnividhāla mĕṟasĕ
vomusunu sĕlulĕlla nūḍigālu seyare