సుదతులాల చూడరమ్మ సోద్య మిదియే కాఁబోలు
(॥పల్లవి॥)
సుదతులాల చూడరమ్మ సోద్య మిదియే కాఁబోలు
అదరి బెదరి కరఁగె గోరు ఆయ మంటఁ బోలును
(॥సుదతులాల॥)
పలికి పలికి వూరకుండె పడఁతి నీతోఁ గొంతతడవు
సొలసె మరునియమ్ము దాఁకి చొక్కు దాఁకఁ బోలును
కులికి కులికి నవ్వు నవ్వి కొంచి కడమవెట్టీ నపుడే
నిలిచి పరవశముల మునిఁగి నిద్దిరించఁ బోలును
(॥సుదతులాల॥)
పదరి పదరి సన్నసేసీ పైకొని నను విడనాడె
యెదుట జవ్వనంపుమదము యెఱుక మాన్పఁ బోలును
పెదవిగదల గొణఁగి గొణఁగి పెద్దగాఁగ వలపు చల్లె
మదనసర్పవిషము దింద మంతిరించఁ బోలును
(॥సుదతులాల॥)
తిరిగి తిరిగి కౌఁగిలించి తెమలి తనువు చెమటఁ దోఁగె
అరిది సురతభావరసము లలుగువారఁ బోలును
మరిగి మరిగి కూడెఁ జెలియ మగుడ శ్రీవేంకటేశుఁ
డెరవు లేక యీకె సేయు యెమ్మెగాఁ బోలును
(||pallavi||)
sudadulāla sūḍaramma sodya midiye kām̐bolu
adari bĕdari karam̐gĕ goru āya maṁṭam̐ bolunu
(||sudadulāla||)
paligi paligi vūraguṁḍĕ paḍam̐ti nīdom̐ gŏṁtadaḍavu
sŏlasĕ maruniyammu dām̐ki sŏkku dām̐kam̐ bolunu
kuligi kuligi navvu navvi kŏṁchi kaḍamavĕṭṭī nabuḍe
nilisi paravaśhamula munim̐gi niddiriṁcham̐ bolunu
(||sudadulāla||)
padari padari sannasesī paigŏni nanu viḍanāḍĕ
yĕduḍa javvanaṁpumadamu yĕṟuga mānpam̐ bolunu
pĕdavigadala gŏṇam̐gi gŏṇam̐gi pĕddagām̐ga valabu sallĕ
madanasarbaviṣhamu diṁda maṁtiriṁcham̐ bolunu
(||sudadulāla||)
tirigi tirigi kaum̐giliṁchi tĕmali tanuvu sĕmaḍam̐ dom̐gĕ
aridi suradabhāvarasamu laluguvāram̐ bolunu
marigi marigi kūḍĕm̐ jĕliya maguḍa śhrīveṁkaḍeśhum̐
ḍĕravu lega yīgĕ seyu yĕmmĕgām̐ bolunu