సుదతుల మెల్లాను సోబానఁ బాడేము
(॥పల్లవి॥)
సుదతుల మెల్లాను సోబానఁ బాడేము
యెదుటనున్ను మము నేలితి వపుడే
(॥సుద॥)
నిండు నిధానము నెలఁత జవ్వనము
కొండలుఁ గోట్లు కుచములు
పండువెన్నెలలు పలచని నవ్వులు
అండనే కలిగెఁ బెండ్లాడవయా
(॥సుద॥)
కనక వసంతము కామిని సరసము
ఘనముగు నీలపుగని కొప్పు
చినుకుఁ దేనియలు చెలఁగేటి పలుకులు
అనువుగ దొరకెఁ బెండ్లాడవయా
(॥సుద॥)
ముంగిట సంపద ముదిత సింగారము
తంగేటి జున్ను బిత్తరి మోవి
చెంగటఁ గలిగెను శ్రీవేంకటేశుఁడ
అంగవించి పెండ్లాడవయా
(||pallavi||)
sudadula mĕllānu sobānam̐ bāḍemu
yĕduḍanunnu mamu nelidi vabuḍe
(||suda||)
niṁḍu nidhānamu nĕlam̐ta javvanamu
kŏṁḍalum̐ goṭlu kusamulu
paṁḍuvĕnnĕlalu palasani navvulu
aṁḍane kaligĕm̐ bĕṁḍlāḍavayā
(||suda||)
kanaga vasaṁtamu kāmini sarasamu
ghanamugu nīlabugani kŏppu
sinugum̐ deniyalu sĕlam̐geḍi palugulu
anuvuga dŏragĕm̐ bĕṁḍlāḍavayā
(||suda||)
muṁgiḍa saṁpada mudida siṁgāramu
taṁgeḍi junnu bittari movi
sĕṁgaḍam̐ galigĕnu śhrīveṁkaḍeśhum̐ḍa
aṁgaviṁchi pĕṁḍlāḍavayā