Sudadigi raajasamu soobavalenaa

సుదతికి రాజసము చూపవలెనా
Language

(॥పల్లవి॥)
సుదతికి రాజసము చూపవలెనా
యెదురుగ నీవే చన వియ్యఁగ వలదా

(॥దతికి॥)
పడతి నీతో నిట్టే పందెము వేయఁగాను
వుడుగక నీవు చెయ్యి వొగ్గ వలదా
జడియక నీతోను సరసమాడఁగాను
నడుమ నీ వింతలోనే నవ్వఁగ వలదా

(॥దతికి॥)
కలపుకోలుగ నీకు కన్నుల మొక్కఁగాను
వెలయ వలపులు దీవించి వలదా
చలివాయఁ గెమ్మోవి చవి నీకుఁ జూపఁగాను
సొలసి నీ వందుకే చొక్కఁగ వలదా

(॥దతికి॥)
అంకెల రతుల నిన్ను అలమి కూడఁగాను
పొంకముగ మెచ్చి మెచ్చి పొదుగవద్దా
కొంకక యలమేల్మంగ కోరి శ్రీవేంకటేశుఁడ
లంకెలాయ నింక నీ లీలలు నించవలదా

(||pallavi||)
sudadigi rājasamu sūbavalĕnā
yĕduruga nīve sana viyyam̐ga valadā

(||dadigi||)
paḍadi nīdo niṭṭe paṁdĕmu veyam̐gānu
vuḍugaga nīvu sĕyyi vŏgga valadā
jaḍiyaga nīdonu sarasamāḍam̐gānu
naḍuma nī viṁtalone navvam̐ga valadā

(||dadigi||)
kalabugoluga nīgu kannula mŏkkam̐gānu
vĕlaya valabulu dīviṁchi valadā
salivāyam̐ gĕmmovi savi nīgum̐ jūbam̐gānu
sŏlasi nī vaṁduge sŏkkam̐ga valadā

(||dadigi||)
aṁkĕla radula ninnu alami kūḍam̐gānu
pŏṁkamuga mĕchchi mĕchchi pŏdugavaddā
kŏṁkaga yalamelmaṁga kori śhrīveṁkaḍeśhum̐ḍa
laṁkĕlāya niṁka nī līlalu niṁchavaladā