సుదతికి మీరిందరూఁ జుట్టాలైన ఫలము
(॥పల్లవి॥)
సుదతికి మీరిందరూఁ జుట్టాలైన ఫలము
మదనుని వేఁడుకోరే మంచిదౌఁ గాని*
(॥సుద॥)
జలములలో నెల్లా చంద్రకాంతాలు చల్లరే
అలతామరలగర్వ మలణఁగుఁగాని
చలపట్టి వనముల జవ్వాది వాసించరే
మలయుఁ జిలుకలకు మాటుమందౌఁగాని
(॥సుద॥)
పొదలపై సంపెంగ పువ్వులు వెదచల్లరే
వుదుటఁ దుమ్మిదమూఁక లుడుఁగుఁగాని
పది దిక్కులను రఘుపతిపేరు దడవరే
గుదిగొన్న కోవిలలు కూయకుండుఁగాని
(॥సుద॥)
పాటలలో శంకరాభరణం మాళాపించరే
నీటు చల్లగాలి సొంపు నిలుచుఁగాని
యీటున శ్రీవేంకటేశుఁ డేలె నలమేల్మంగను
చాటించరే యిన్నీఁ దొంటి జాడల నుండుఁగాని
(||pallavi||)
sudadigi mīriṁdarūm̐ juṭṭālaina phalamu
madanuni vem̐ḍugore maṁchidaum̐ gāni*
(||suda||)
jalamulalo nĕllā saṁdragāṁtālu sallare
aladāmaralagarva malaṇam̐gum̐gāni
salabaṭṭi vanamula javvādi vāsiṁchare
malayum̐ jilugalagu māḍumaṁdaum̐gāni
(||suda||)
pŏdalabai saṁpĕṁga puvvulu vĕdasallare
vuduḍam̐ dummidamūm̐ka luḍum̐gum̐gāni
padi dikkulanu raghubadiberu daḍavare
gudigŏnna kovilalu kūyaguṁḍum̐gāni
(||suda||)
pāḍalalo śhaṁkarābharaṇaṁ māḽābiṁchare
nīḍu sallagāli sŏṁpu nilusum̐gāni
yīḍuna śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nalamelmaṁganu
sāḍiṁchare yinnīm̐ dŏṁṭi jāḍala nuṁḍum̐gāni