సుదతి వున్నభావము చూడఁగరాదా నీవే
(॥పల్లవి॥)
సుదతి వున్నభావము చూడఁగరాదా నీవే
పదిమారులును నొడఁబరచఁగనేఁటికి
(॥సుద॥)
సేసపాలు దైవారె చిప్పిలిఁగఁ జెమరించె
ఆసలు లోలో నిండె ఆయాలు గరఁగె
రాసికెక్కెఁ దమకము రచ్చఁబడె వలపులు
వేసరక యెందాఁకాను విన్నవించె మిఁకను
(॥సుద॥)
కోరిక లీరికె లెత్తె గుంపులాయఁ బులకలు
వూరెను మోవితేనెలు వొదగె నిట్టూర్పు
నారుకొనెఁ గూరిములు ననిచెఁ జిఱునవ్వులు
తారుకాణగా నెంత తలఁపించే మిఁకను
(॥సుద॥)
కళలు మోమున ముంచె కన్నులఁ జెంగావి మించె
పలుకులఁ బచ్చిదేరె పరగె వేడుకలు
యెలమి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
సలిగెఁ గూడె నిన్నెంత సాదించే మిఁకను
(||pallavi||)
sudadi vunnabhāvamu sūḍam̐garādā nīve
padimārulunu nŏḍam̐barasam̐ganem̐ṭigi
(||suda||)
sesabālu daivārĕ sippilim̐gam̐ jĕmariṁchĕ
āsalu lolo niṁḍĕ āyālu garam̐gĕ
rāsigĕkkĕm̐ damagamu rachcham̐baḍĕ valabulu
vesaraga yĕṁdām̐kānu vinnaviṁchĕ mim̐kanu
(||suda||)
koriga līrigĕ lĕttĕ guṁpulāyam̐ bulagalu
vūrĕnu movidenĕlu vŏdagĕ niṭṭūrbu
nārugŏnĕm̐ gūrimulu nanisĕm̐ jiṟunavvulu
tārugāṇagā nĕṁta talam̐piṁche mim̐kanu
(||suda||)
kaḽalu momuna muṁchĕ kannulam̐ jĕṁgāvi miṁchĕ
palugulam̐ bachchiderĕ paragĕ veḍugalu
yĕlami śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
saligĕm̐ gūḍĕ ninnĕṁta sādiṁche mim̐kanu