Sudadi nerbu levvariginim joobiseppa vasamugaadu

సుదతి నేర్పు లెవ్వరికినిఁ జూపిచెప్ప వసముగాదు
Language

(॥పల్లవి॥)
సుదతి నేర్పు లెవ్వరికినిఁ జూపిచెప్ప వసముగాదు
అదరిపాటు నీకు నాపె కందుకోళ్లాయను

(॥సుద॥)
విరులు నిండఁ గొప్పువెట్టి వెలఁది నిన్ను నిక్కిచూచి
సురటి చాటువెట్టుకొనుచు చొక్కి వలపు దాఁచెను
వరుసఁ జెమటఁ దొప్పఁదోఁగివలిపెపయ్యదంటుకొనఁగ
శిరసువంచి వెనకమరలి సిగ్గుదేర నవ్వేను

(॥సుద॥)
అతివ వీణె మీఁటి నీవు యచట నాలకించు టెఱిఁగి
సతుల మాఁటుసేసి యొదిగి చదురుఁదనము దాఁచెను
మతిగరఁగి యంతలోనె మదనకళలు వుప్పతిలఁగ
రతులయాస చిలుకఁజూచి రమణ సన్నసేసెను

(॥సుద॥)
వనిత పరిమళములు వూసి వాసనలు నీమీఁదఁబొదువ
పెనఁగలేక గుట్టుతోనె బిగువులెల్ల దాఁచెను
యెనసితివి శ్రీ వేంకటేశుఁడ యీకె నిన్ని చందములను
చెనకుచును నినుఁ బలుదెఱంగుల చిత్తమలరఁజేసెను

(||pallavi||)
sudadi nerbu lĕvvariginim̐ jūbisĕppa vasamugādu
adaribāḍu nīgu nābĕ kaṁdugoḽlāyanu

(||suda||)
virulu niṁḍam̐ gŏppuvĕṭṭi vĕlam̐di ninnu nikkisūsi
suraḍi sāḍuvĕṭṭugŏnusu sŏkki valabu dām̐sĕnu
varusam̐ jĕmaḍam̐ dŏppam̐dom̐givalibĕbayyadaṁṭugŏnam̐ga
śhirasuvaṁchi vĕnagamarali siggudera navvenu

(||suda||)
adiva vīṇĕ mīm̐ṭi nīvu yasaḍa nālagiṁchu ṭĕṟim̐gi
sadula mām̐ṭusesi yŏdigi sadurum̐danamu dām̐sĕnu
madigaram̐gi yaṁtalonĕ madanagaḽalu vuppadilam̐ga
radulayāsa silugam̐jūsi ramaṇa sannasesĕnu

(||suda||)
vanida parimaḽamulu vūsi vāsanalu nīmīm̐dam̐bŏduva
pĕnam̐galega guṭṭudonĕ biguvulĕlla dām̐sĕnu
yĕnasidivi śhrī veṁkaḍeśhum̐ḍa yīgĕ ninni saṁdamulanu
sĕnagusunu ninum̐ baludĕṟaṁgula sittamalaram̐jesĕnu