సుదతి లాగులన్నీఁ జూడవయ్యా
(॥పల్లవి॥)
సుదతి లాగులన్నీఁ జూడవయ్యా
యిదివో నిన్నీలాగున నెలయించీఁ దాను
(॥సుదతి॥)
చెలరేఁగి నీ కెంత సేవలు సేసీఁదాను
పలుమారు దండె మీఁటి పాడీఁ దాను
కులికి నీవు చూడఁగా కొప్పులు వెట్టీఁ దాను
నిలుచుండి యద్దములో నీడ చూచీఁ దాను
(॥సుదతి॥)
తనివోక నీదిక్కు తళుకునఁ జూచీఁ దాను
ననిచి నీతో సెలవి నవ్వీఁ దాను
పనివడి నీవొద్దనే వయ్యద జారించీఁ దాను
చినుకుఁ జెమటతోట సిగ్గువడీఁ దాను
(॥సుదతి॥)
మొక్కేదానివలె నీకు మురిపెము చూపీఁ దాను
చక్కఁదనాలెల్లాఁ బచారించీఁ దాను
నెక్కొని శ్రీవేంకటటేశ నీవు నేనుఁ గూడుండఁగ
గక్కనఁ జుట్టమువలెఁ గాఁగిలించీఁ దాను
(||pallavi||)
sudadi lāgulannīm̐ jūḍavayyā
yidivo ninnīlāguna nĕlayiṁchīm̐ dānu
(||sudadi||)
sĕlarem̐gi nī kĕṁta sevalu sesīm̐dānu
palumāru daṁḍĕ mīm̐ṭi pāḍīm̐ dānu
kuligi nīvu sūḍam̐gā kŏppulu vĕṭṭīm̐ dānu
nilusuṁḍi yaddamulo nīḍa sūsīm̐ dānu
(||sudadi||)
tanivoga nīdikku taḽugunam̐ jūsīm̐ dānu
nanisi nīdo sĕlavi navvīm̐ dānu
panivaḍi nīvŏddane vayyada jāriṁchīm̐ dānu
sinugum̐ jĕmaḍadoḍa sigguvaḍīm̐ dānu
(||sudadi||)
mŏkkedānivalĕ nīgu muribĕmu sūbīm̐ dānu
sakkam̐danālĕllām̐ basāriṁchīm̐ dānu
nĕkkŏni śhrīveṁkaḍaḍeśha nīvu nenum̐ gūḍuṁḍam̐ga
gakkanam̐ juṭṭamuvalĕm̐ gām̐giliṁchīm̐ dānu