సుదతి భావము నేఁడు చూడవయ్య
(॥పల్లవి॥)
సుదతి భావము నేఁడు చూడవయ్య
యెదుట నీకె నేర్పున నిన్నిటా గెలిచేను
(॥సుదతి॥)
అలసి విరహవేళ నటు చంద్రోదయమైతే
కలువలు ముడిచెను కలికి
తలఁపులోపలఁ బరితాప సూర్యుఁ డెసఁగితే
జలజాలు చేతఁబట్టె జవరాలు
(॥సుదతి॥)
సరి నొంటి నుండఁగాను చల్లగాలి విసరితే
గరిమ గందము వూసెఁ గామిని
వరుస నంతటిలోన వసంతుఁడు వొడమితే
పొరిఁబొరిఁ జిగురుఁబాన్పునఁ బండెఁ జెలియ
(॥సుదతి॥)
వినుకలిఁ జొక్కఁగాను వెస మరుఁ డేఁచితేను
ఘనమకరాలచీర గట్టె నతివ
యెనసి శ్రీ వెంకటేశ యీకె యలమేలుమంగ
నినుఁ గాఁగిటను నించి నెలకొనెఁ దరుణి
(||pallavi||)
sudadi bhāvamu nem̐ḍu sūḍavayya
yĕduḍa nīgĕ nerbuna ninniḍā gĕlisenu
(||sudadi||)
alasi virahaveḽa naḍu saṁdrodayamaide
kaluvalu muḍisĕnu kaligi
talam̐pulobalam̐ baridāba sūryum̐ ḍĕsam̐gide
jalajālu sedam̐baṭṭĕ javarālu
(||sudadi||)
sari nŏṁṭi nuṁḍam̐gānu sallagāli visaride
garima gaṁdamu vūsĕm̐ gāmini
varusa naṁtaḍilona vasaṁtum̐ḍu vŏḍamide
pŏrim̐bŏrim̐ jigurum̐bānpunam̐ baṁḍĕm̐ jĕliya
(||sudadi||)
vinugalim̐ jŏkkam̐gānu vĕsa marum̐ ḍem̐sidenu
ghanamagarālasīra gaṭṭĕ nadiva
yĕnasi śhrī vĕṁkaḍeśha yīgĕ yalamelumaṁga
ninum̐ gām̐giḍanu niṁchi nĕlagŏnĕm̐ daruṇi