Soridi samsaarambu sukhamaa yimdarigi

సొరిది సంసారంబు సుఖమా యిందరికి
Language

(॥పల్లవి॥)
సొరిది సంసారంబు సుఖమా యిందరికి
వెరవెఱంగక వగల వేఁగేరు గాక

(॥సొరిది॥)
దేహములు దలఁప సుస్థిరములా ప్రాణులకు-
నూహింప లోభ మట్లుండుఁ గాక
మోహంబుచే వెనకముందెఱుఁగలేక తమ-
దేహసుఖములు మరిగి తిరిగేరుగాక

(॥సొరిది॥)
నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్వరికి
అలవి నిలుపఁగరాని యాస గాక
బలువైన వట్టి విభ్రాంతిచే దగులువడి
తెలిసియును దెలియ కిటు తిరిగేరు గాక

(॥సొరిది॥)
నెఱయువిభవములెల్ల నిజములా యిందరికి
కొఱమాలినట్టి తమగుణముగాక
యెఱుకతోఁ దిరువేంకటేశుఁ గొలువఁగలేక
తెఱఁగుమాలిన బుద్ధిఁ దిరిగేరుగాక

(||pallavi||)
sŏridi saṁsāraṁbu sukhamā yiṁdarigi
vĕravĕṟaṁgaga vagala vem̐geru gāga

(||sŏridi||)
dehamulu dalam̐pa susthiramulā prāṇulagu-
nūhiṁpa lobha maṭluṁḍum̐ gāga
mohaṁbuse vĕnagamuṁdĕṟum̐galega tama-
dehasukhamulu marigi tirigerugāga

(||sŏridi||)
nĕlagŏnnadravyamulu nilusunā yĕvvarigi
alavi nilubam̐garāni yāsa gāga
baluvaina vaṭṭi vibhrāṁtise daguluvaḍi
tĕlisiyunu dĕliya kiḍu tirigeru gāga

(||sŏridi||)
nĕṟayuvibhavamulĕlla nijamulā yiṁdarigi
kŏṟamālinaṭṭi tamaguṇamugāga
yĕṟugadom̐ diruveṁkaḍeśhum̐ gŏluvam̐galega
tĕṟam̐gumālina buddhim̐ dirigerugāga