సొరిది నీ సరితలు చూచితిఁ గాక
(॥పల్లవి॥)
సొరిది నీ సరితలు చూచితిఁ గాక
సిరుల నీ సేవలు సేయక విడిచేనా
(॥॥)
కప్పురాన వేసేవు కడుసన్నలు సేసేవు
యెప్పుడు నీసుద్దులు నే నెఱఁగనివా
దప్పిదేరఁ బలికేవు తమితో బుజ్జగించేవు
చెప్పినట్లు నే నీకు సేయకుండేనా
(॥॥)
విరులెల్లా ముడిచేవు వీడెము నాకిచ్చేవు
మరిగి నీమేలు నేను మఱచితినా
పొరిఁబొరిగుణములు పొగడేవు నావద్ద
తిరముగా నిట్టె సమ్మతించక మానుదునా
(॥॥)
కలకలనవ్వేవు కాఁగిట బిగించేవు
తొలుతనే నే నిన్ను సంతోసించనివా
యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నెలవైననాకు నవి నేఁడు గొత్తలా
(||pallavi||)
sŏridi nī saridalu sūsidim̐ gāga
sirula nī sevalu seyaga viḍisenā
(||||)
kappurāna vesevu kaḍusannalu sesevu
yĕppuḍu nīsuddulu ne nĕṟam̐ganivā
dappideram̐ baligevu tamido bujjagiṁchevu
sĕppinaṭlu ne nīgu seyaguṁḍenā
(||||)
virulĕllā muḍisevu vīḍĕmu nāgichchevu
marigi nīmelu nenu maṟasidinā
pŏrim̐bŏriguṇamulu pŏgaḍevu nāvadda
tiramugā niṭṭĕ sammadiṁchaga mānudunā
(||||)
kalagalanavvevu kām̐giḍa bigiṁchevu
tŏludane ne ninnu saṁtosiṁchanivā
yĕlami śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nĕlavainanāgu navi nem̐ḍu gŏttalā