సొరిది మీ సరితలు చూతము గాక
(॥పల్లవి॥)
సొరిది మీ సరితలు చూతము గాక
అరిది మమ్మేల సాకి రడిగేరు మీరు
(॥సొరిది॥)
చెలిమికాఁడ వు గాన చెలి నీకు వెట్టెఁ దమ్మ
మలసి నవ్వులు నవ్వ మాకేల
బలిమికాఁడవు గాన పట్టి నిన్నుఁ దియ్య గాను
అలరి యడ్డాలు రా నంత మా కేలా
(॥సొరిది॥)
చేకొద్దివాఁడవు గాన చెప్పె నీకుఁ బను లెల్లా
మాకు నిన్ను గేలిసేయ మఱి యేలా
పైకొన్నవాఁడవు గాన పడతి రాకొట్టు గొట్టె
కైకొని మీమాటలు వంకలు దిద్ద నేలా
(॥సొరిది॥)
మేనఁవాడ వటు గాన మెడఁగట్టుకో నిచ్చె
తానే యలమేలుమంగ తమక మేలా
పూని శ్రీవేంకటేశుఁడ పొందుగా మ మ్మేలితివి
కానీలే మి మ్మెఁఱిగితి కడమ లింకేలా
(||pallavi||)
sŏridi mī saridalu sūdamu gāga
aridi mammela sāgi raḍigeru mīru
(||sŏridi||)
sĕlimigām̐ḍa vu gāna sĕli nīgu vĕṭṭĕm̐ damma
malasi navvulu navva māgela
balimigām̐ḍavu gāna paṭṭi ninnum̐ diyya gānu
alari yaḍḍālu rā naṁta mā kelā
(||sŏridi||)
segŏddivām̐ḍavu gāna sĕppĕ nīgum̐ banu lĕllā
māgu ninnu geliseya maṟi yelā
paigŏnnavām̐ḍavu gāna paḍadi rāgŏṭṭu gŏṭṭĕ
kaigŏni mīmāḍalu vaṁkalu didda nelā
(||sŏridi||)
menam̐vāḍa vaḍu gāna mĕḍam̐gaṭṭugo nichchĕ
tāne yalamelumaṁga tamaga melā
pūni śhrīveṁkaḍeśhum̐ḍa pŏṁdugā ma mmelidivi
kānīle mi mmĕm̐ṟigidi kaḍama liṁkelā