Soosugo mumdadi pani soodidappagumdaanu

చూచుకో ముందటి పని సూటిదప్పకుండాను
Language

(॥పల్లవి॥)
చూచుకో ముందటి పని సూటిదప్పకుండాను
యేచి యీకె గుణమెద్దో యెఱఁగము సుమ్మీ

(॥చూచు॥)
నమ్మికిచ్చి యాపెఁదెచ్చి నామొగము చూచి నీవు
కమ్మటి లోఁగుచు నిచ్చకము సేసేవు
దిమ్మరిమాటల యోపె దిక్కుల నీసుద్ది వింటే
యెమ్మల నేమిసేసునో యెఱఁగముసుమ్మీ

(॥చూచు॥)
పానుపుపై నాకెఁ బెట్టి పక్కననుఁ దెరవేసి
పూని నే రాఁగా నాతో పొందుసేసేవు
నానాబుద్దులెరిఁగిననాతి యాపె ఇందుకుఁగా
యీ(యే?) నెపాన సాదించునో యెఱఁగముసుమ్మీ

(॥చూచు॥)
వొద్దికతో నాపెఁగూడి వొడివట్టి నేఁదియ్యంగా
బుద్దిచెప్పి నన్ను నేలి బుజ్జగించేవు
అద్దిరా శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
ఇద్దెస నెట్టొరసునో యెఱంగము సుమ్మీ

(||pallavi||)
sūsugo muṁdaḍi pani sūḍidappaguṁḍānu
yesi yīgĕ guṇamĕddo yĕṟam̐gamu summī

(||sūsu||)
nammigichchi yābĕm̐dĕchchi nāmŏgamu sūsi nīvu
kammaḍi lom̐gusu nichchagamu sesevu
dimmarimāḍala yobĕ dikkula nīsuddi viṁṭe
yĕmmala nemisesuno yĕṟam̐gamusummī

(||sūsu||)
pānububai nāgĕm̐ bĕṭṭi pakkananum̐ dĕravesi
pūni ne rām̐gā nādo pŏṁdusesevu
nānābuddulĕrim̐ginanādi yābĕ iṁdugum̐gā
yī(ye?) nĕbāna sādiṁchuno yĕṟam̐gamusummī

(||sūsu||)
vŏddigado nābĕm̐gūḍi vŏḍivaṭṭi nem̐diyyaṁgā
buddisĕppi nannu neli bujjagiṁchevu
addirā śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
iddĕsa nĕṭṭŏrasuno yĕṟaṁgamu summī