చూచినవారు నవ్వేరు సుదతి నిన్ను
(॥పల్లవి॥)
చూచినవారు నవ్వేరు సుదతి నిన్ను
నీచేత జారిన కొప్పు నీవు ముడుచుకోవే
(॥చూచి॥)
యెవ్వరి నేరుపులు యెవ్వరికి వచ్చీనే
నవ్వినవారి సొమ్మే నాయకుఁడు
నివ్వటిల్లే చెమటతో నీవేల వెంగెమాడేవే
దువ్వటము పయ్యెదను తుడుచుకోవే
(॥చూచి॥)
తట్టువడ నీవేల తగవులు చెప్పేవే
నెట్టుకొన్నవారి సొమ్మే నిండు భోగాలు
నిట్టూర్పుగములతో నీవేల యలసేవు
వెట్ట దీర సురటిని విసరుకోవే
(॥చూచి॥)
మందగించి నీవేల మచ్చికలు చూపేవే
కందువయివవారి సొమ్మే కాఁగిటి రతి
అంది శ్రీ వేంకటేశుఁడు అలమేలుమంగ నేను
పొందితిమి యిఁక నీవు బువ్వానకు రావే
(||pallavi||)
sūsinavāru navveru sudadi ninnu
nīseda jārina kŏppu nīvu muḍusugove
(||sūsi||)
yĕvvari nerubulu yĕvvarigi vachchīne
navvinavāri sŏmme nāyagum̐ḍu
nivvaḍille sĕmaḍado nīvela vĕṁgĕmāḍeve
duvvaḍamu payyĕdanu tuḍusugove
(||sūsi||)
taṭṭuvaḍa nīvela tagavulu sĕppeve
nĕṭṭugŏnnavāri sŏmme niṁḍu bhogālu
niṭṭūrbugamulado nīvela yalasevu
vĕṭṭa dīra suraḍini visarugove
(||sūsi||)
maṁdagiṁchi nīvela machchigalu sūbeve
kaṁduvayivavāri sŏmme kām̐giḍi radi
aṁdi śhrī veṁkaḍeśhum̐ḍu alamelumaṁga nenu
pŏṁdidimi yim̐ka nīvu buvvānagu rāve