చూచినవారు నవ్వేరు సుదతీ నీ చేఁతలకు
(॥పల్లవి॥)
చూచినవారు నవ్వేరు సుదతీ నీ చేఁతలకు
యీ చాయ నాతనికి నెందరైనా నున్నారు
(॥చూచి॥)
జారీ నీపయ్యద చక్కఁబెట్టుకొనవే
చేరి పతి నెందాఁకాఁ జూచే విపుడు
కోరకొప్పు వంగీ నది కూడ ముడుచుకొనవే
నీరువలెఁ గరఁగుతా నివ్వెరగు లేఁటికి
(॥చూచి॥)
చెక్కులవెంటఁ గారేచెమట దుడుచుకోవే
అక్కర నాతనితో మాఁటలాడేవుగాని
చిక్కవడ్డ నీసరులు చక్కదిద్దుకొనవే
వెక్కసపునవ్వులతో విఱ్ఱవీఁగ నేఁటికి
(॥చూచి॥)
వెలిఁబడ్డపులకలు వెసఁ గప్పుకొనవే
అలరి వెనకఁ బెండ్లాడేవుగాని
అలమేలుమంగను నేనతఁడు శ్రీవేంకటేశుఁ
డెలమి నన్నుఁ గూడె నిఁకఁ గరఁగ నేఁటికి
(||pallavi||)
sūsinavāru navveru sudadī nī sem̐talagu
yī sāya nādanigi nĕṁdarainā nunnāru
(||sūsi||)
jārī nībayyada sakkam̐bĕṭṭugŏnave
seri padi nĕṁdām̐kām̐ jūse vibuḍu
koragŏppu vaṁgī nadi kūḍa muḍusugŏnave
nīruvalĕm̐ garam̐gudā nivvĕragu lem̐ṭigi
(||sūsi||)
sĕkkulavĕṁṭam̐ gāresĕmaḍa duḍusugove
akkara nādanido mām̐ṭalāḍevugāni
sikkavaḍḍa nīsarulu sakkadiddugŏnave
vĕkkasabunavvulado viṭravīm̐ga nem̐ṭigi
(||sūsi||)
vĕlim̐baḍḍabulagalu vĕsam̐ gappugŏnave
alari vĕnagam̐ bĕṁḍlāḍevugāni
alamelumaṁganu nenadam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍĕlami nannum̐ gūḍĕ nim̐kam̐ garam̐ga nem̐ṭigi