Soosinavaariginellaa sobhanamai vumduvu

చూచినవారికినెల్లా సోభనమై వుందువు
Language

(॥పల్లవి॥)
చూచినవారికినెల్లా సోభనమై వుందువు
తాచిన శ్రీవేంకటేశ దైవమై వుందువు

(॥చూచి॥)
నాలుగుచేతులతోడ నలి నీవు నిలుచుంటే
చాలి కొమ్ములకల్పవృక్షమువలె నుందువు
మేలిమపీతాంబరాన మెరసి నీ వుంటేను
వాలిన బంగారురాశివలె నుందువు

(॥చూచి॥)
జమళిపాదములతో సరి నీవు నిలుచుంటే
అమరి యిహపరము లందినట్టె వుందువు
తమినీలవర్ణముతోఁ దగ నీవు నిలుచుంటే
గమిఁ గనకవరుషకాలమేఘ మౌదువు

(॥చూచి॥)
కొండవంటి తురుముతోఁ గోరి నీవు నిలుచుంటే
మెండుశిఖరముతోడి మేడవలె నుందువు
అండనె శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడి
వుండితే మిన్నునేలా నొక్కటైనట్లుందువు

(||pallavi||)
sūsinavāriginĕllā sobhanamai vuṁduvu
tāsina śhrīveṁkaḍeśha daivamai vuṁduvu

(||sūsi||)
nāluguseduladoḍa nali nīvu nilusuṁṭe
sāli kŏmmulagalbavṛkṣhamuvalĕ nuṁduvu
melimabīdāṁbarāna mĕrasi nī vuṁṭenu
vālina baṁgārurāśhivalĕ nuṁduvu

(||sūsi||)
jamaḽibādamulado sari nīvu nilusuṁṭe
amari yihabaramu laṁdinaṭṭĕ vuṁduvu
taminīlavarṇamudom̐ daga nīvu nilusuṁṭe
gamim̐ ganagavaruṣhagālamegha mauduvu

(||sūsi||)
kŏṁḍavaṁṭi turumudom̐ gori nīvu nilusuṁṭe
mĕṁḍuśhikharamudoḍi meḍavalĕ nuṁduvu
aṁḍanĕ śhrīveṁkaḍādri nalamelumaṁgam̐ gūḍi
vuṁḍide minnunelā nŏkkaḍainaṭluṁduvu