చూచినవారికిఁ జూడ సోద్యములై తోఁచునివి
(॥పల్లవి॥)
చూచినవారికిఁ జూడ సోద్యములై తోఁచునివి
కాచుక తిరుగఁగాను కాఁతాళమవుఁ జుమ్మీ
(॥॥)
నీమాటలోనిదాన నీవు నాకుఁ గూరుతువు
యేమిటికి వేఁడుకొనే వింతెరఁగనా
కోమలము నామనసు గుట్టుతో దొరవు నీవు
చేముట్టి పెనఁగఁగాను జీరవారీఁ జుమ్మీ
(॥॥)
పట్టపుదేవులభావమెల్లా నీసొమ్ము
వొట్టేల పెట్టుకొనేవు వుండఁబట్టదా
మట్టులేదు నాయాస మగఁడవు నీవు నాకు
గట్టిచన్ను లంటఁగాను కాఁకరేఁగీఁ జుమ్మీ
(॥॥)
ఇచ్చకురాలను నీకు ఇట్టె నన్నుఁ గూడితివి
పచ్చిగానేలనవ్వేవు పంతగాఁడవా
నిచ్చపెండ్లికూఁతురను నీకు శ్రీవేంకటేశుఁడ
మెచ్చి మెచ్చి మోవానఁగా మిక్కుటమౌఁ జుమ్మీ
(||pallavi||)
sūsinavārigim̐ jūḍa sodyamulai tom̐sunivi
kāsuga tirugam̐gānu kām̐tāḽamavum̐ jummī
(||||)
nīmāḍalonidāna nīvu nāgum̐ gūruduvu
yemiḍigi vem̐ḍugŏne viṁtĕram̐ganā
komalamu nāmanasu guṭṭudo dŏravu nīvu
semuṭṭi pĕnam̐gam̐gānu jīravārīm̐ jummī
(||||)
paṭṭabudevulabhāvamĕllā nīsŏmmu
vŏṭṭela pĕṭṭugŏnevu vuṁḍam̐baṭṭadā
maṭṭuledu nāyāsa magam̐ḍavu nīvu nāgu
gaṭṭisannu laṁṭam̐gānu kām̐karem̐gīm̐ jummī
(||||)
ichchagurālanu nīgu iṭṭĕ nannum̐ gūḍidivi
pachchigānelanavvevu paṁtagām̐ḍavā
nichchabĕṁḍligūm̐turanu nīgu śhrīveṁkaḍeśhum̐ḍa
mĕchchi mĕchchi movānam̐gā mikkuḍamaum̐ jummī