చూచినవారికిఁ జూడ సోద్యా లివి
(॥పల్లవి॥)
చూచినవారికిఁ జూడ సోద్యా లివి
యేచిన వేడుకె కాని యెంతైనా వీఁగదూ
(॥చూచిన॥)
యెట్టు నమ్మెనో నీ చిత్త మింతి యెవ్వరు చెప్పిన
జట్టిగొన నవ్వుఁ గాని చంచలించదు
మట్టు లేని నీ వెంతమాట పట్టిచ్చితివో
గుట్టుతోనే మెచ్చుఁ గాని కొంతైన వెరవదూ
(॥చూచిన॥)
కలికి నీ నిజ మెట్టు గనెనో నీ సుద్దులకు
చెలరేఁగె వుండుఁ గాని చిన్నఁబోదు
చెలిమి నీ వాపె కెంత చేతికి లో నైతివో
వలపులె చల్లుఁ గాని వసివాడదూ
(॥చూచిన॥)
నీ మర్మ మె ట్టెఱిఁగెనో నెలఁత నీరతులకు
వేమారుఁ బైకొనుఁ గాని వేసారదు
నేమపు శ్రీవెంకటేశ నీ వెంత చొక్కించితివో
ఆమనిభోగమె కాని ఆలయి కెరఁగదు
(||pallavi||)
sūsinavārigim̐ jūḍa sodyā livi
yesina veḍugĕ kāni yĕṁtainā vīm̐gadū
(||sūsina||)
yĕṭṭu nammĕno nī sitta miṁti yĕvvaru sĕppina
jaṭṭigŏna navvum̐ gāni saṁchaliṁchadu
maṭṭu leni nī vĕṁtamāḍa paṭṭichchidivo
guṭṭudone mĕchchum̐ gāni kŏṁtaina vĕravadū
(||sūsina||)
kaligi nī nija mĕṭṭu ganĕno nī suddulagu
sĕlarem̐gĕ vuṁḍum̐ gāni sinnam̐bodu
sĕlimi nī vābĕ kĕṁta sedigi lo naidivo
valabulĕ sallum̐ gāni vasivāḍadū
(||sūsina||)
nī marma mĕ ṭṭĕṟim̐gĕno nĕlam̐ta nīradulagu
vemārum̐ baigŏnum̐ gāni vesāradu
nemabu śhrīvĕṁkaḍeśha nī vĕṁta sŏkkiṁchidivo
āmanibhogamĕ kāni ālayi kĕram̐gadu