Soosinavaarigi nidi sodyamulayyaa

చూచినవారికి నిది సోద్యములయ్యా
Language

(॥పల్లవి॥)
చూచినవారికి నిది సోద్యములయ్యా
నీ చనవు గాదనేనా నీ చిత్తమయ్యా

(॥చూచి॥)
కాకిపైఁడి మాబొట్టు కప్పు పారిటాకు పట్టు
పైకొనఁ జూచేవు నీకు బాఁతైతినా
మేకుల మొల్లలకొప్పు మేనెల్లఁ గస్తూరితుప్పు
కైకొని నిన్ను మెప్పించఁగలనటవయ్యా

(॥చూచి॥)
చెక్కుల జవ్వాది నూనె చెంచుజాతి తోడుతోనె
యిక్కువ నాతోఁ బెనఁగే వింత కోపేవా
పెక్కువపూఁబొద యిల్లు పిసకత్తి యేదుముల్లు
నిక్కి నిక్కి చూచేవు నీకు నింతేలయ్యా

(॥చూచి॥)
పానుపు లేఁతచిగురు పట్టువలపు జిగురు
నానాఁటి కిఁక నంత నవ్వకువయ్యా
యీనెపాన శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
ఆని నీనామై గురుతు లంటెఁ బైపైనయ్యా

(||pallavi||)
sūsinavārigi nidi sodyamulayyā
nī sanavu gādanenā nī sittamayyā

(||sūsi||)
kāgibaim̐ḍi mābŏṭṭu kappu pāriḍāgu paṭṭu
paigŏnam̐ jūsevu nīgu bām̐taidinā
megula mŏllalagŏppu menĕllam̐ gastūriduppu
kaigŏni ninnu mĕppiṁcham̐galanaḍavayyā

(||sūsi||)
sĕkkula javvādi nūnĕ sĕṁchujādi toḍudonĕ
yikkuva nādom̐ bĕnam̐ge viṁta kobevā
pĕkkuvabūm̐bŏda yillu pisagatti yedumullu
nikki nikki sūsevu nīgu niṁtelayyā

(||sūsi||)
pānubu lem̐tasiguru paṭṭuvalabu jiguru
nānām̐ṭi kim̐ka naṁta navvaguvayyā
yīnĕbāna śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
āni nīnāmai gurudu laṁṭĕm̐ baibainayyā