Soosinavaaremamduru sudadunellaa

చూచినవారేమందురు సుదతునెల్లా
Language

(॥పల్లవి॥)
చూచినవారేమందురు సుదతునెల్లా
యేచి సదమదముగా నింత పెనఁగితివి

(॥చూచి॥)
ఆఁటది వలచెనంటా నంగడిఁ బెట్టేవు నీవు
నాఁటకుఁడ యెవ్వరైనా నమ్మఁగవద్దా
నీటుతోడ సిగ్గువడి నిలుచుండఁగా బయ్యద-
చాటున నున్న గుబ్బలు సారెకు గీరితివి

(॥చూచి॥)
కన్నె నీతొడెక్కెనంటా కాకుసేసే విన్నిటాను
వన్నెకాఁడ వాడవారు వలవవద్దా
వున్నతిఁ దలవంచుక వుండఁగానే మోవితేనె
సన్నలఁ బరచి చప్పుచాడు సేసితివి

(॥చూచి॥)
ముద్దరాలలమేల్మంగ మొక్కెనంటా నవ్వేవు నే-
మద్దో శ్రీవేంకటేశ నిన్నవుననవద్దా
గద్దించి కాఁగిటిరతిఁ గలయఁగ మేనెల్ల
చద్దివేడి చెమటలఁ జౌకులు రేఁచితివి

(||pallavi||)
sūsinavāremaṁduru sudadunĕllā
yesi sadamadamugā niṁta pĕnam̐gidivi

(||sūsi||)
ām̐ṭadi valasĕnaṁṭā naṁgaḍim̐ bĕṭṭevu nīvu
nām̐ṭagum̐ḍa yĕvvarainā nammam̐gavaddā
nīḍudoḍa sigguvaḍi nilusuṁḍam̐gā bayyada-
sāḍuna nunna gubbalu sārĕgu gīridivi

(||sūsi||)
kannĕ nīdŏḍĕkkĕnaṁṭā kāgusese vinniḍānu
vannĕgām̐ḍa vāḍavāru valavavaddā
vunnadim̐ dalavaṁchuga vuṁḍam̐gāne movidenĕ
sannalam̐ barasi sappusāḍu sesidivi

(||sūsi||)
muddarālalamelmaṁga mŏkkĕnaṁṭā navvevu ne-
maddo śhrīveṁkaḍeśha ninnavunanavaddā
gaddiṁchi kām̐giḍiradim̐ galayam̐ga menĕlla
saddiveḍi sĕmaḍalam̐ jaugulu rem̐sidivi