చూచినవారెల్ల నన్నే సొరిది నుప్పతింతురు
(॥పల్లవి॥)
చూచినవారెల్ల నన్నే సొరిది నుప్పతింతురు
మా చనవు చెల్లించి మన్నించరాదా
(॥॥)
యేమి వొడఁబరచేవు యేల నిలుచున్నాఁడవు
గోమున నావద్ద నిట్టే కూచుండరాదా
నీ మాట మీరేనా నీవే నేఁగానా
వాము లాయ వలపులు వడిఁబెట్ట కింకను
(॥॥)
కనురెప్పలు వేయవు కడుఁ జేయి చాఁచేవు
యెనసి యేపొద్దు నీకు నీదే పనా
పెనఁగినా నీతోను బెట్టి మాట లాడేనా
తనిసితి మాటలనే తమి యింకా రేఁచేవు
(॥॥)
సింగారించు కొంటివి చెక్కులనే నవ్వితివి
కొంగుపట్టి కూడితివి కొంకు దీరెను
యింగితాన శ్రీ వేంకటేశ నీ రతి మెచ్చితి
సంగతాయఁ బనులెల్ల సతమాయ మనసూ.
(||pallavi||)
sūsinavārĕlla nanne sŏridi nuppadiṁturu
mā sanavu sĕlliṁchi manniṁcharādā
(||||)
yemi vŏḍam̐barasevu yela nilusunnām̐ḍavu
gomuna nāvadda niṭṭe kūsuṁḍarādā
nī māḍa mīrenā nīve nem̐gānā
vāmu lāya valabulu vaḍim̐bĕṭṭa kiṁkanu
(||||)
kanurĕppalu veyavu kaḍum̐ jeyi sām̐sevu
yĕnasi yebŏddu nīgu nīde panā
pĕnam̐ginā nīdonu bĕṭṭi māḍa lāḍenā
tanisidi māḍalane tami yiṁkā rem̐sevu
(||||)
siṁgāriṁchu kŏṁṭivi sĕkkulane navvidivi
kŏṁgubaṭṭi kūḍidivi kŏṁku dīrĕnu
yiṁgidāna śhrī veṁkaḍeśha nī radi mĕchchidi
saṁgadāyam̐ banulĕlla sadamāya manasū.