Soosinaaru daya putte sompagu nee sitta metto

చూచినారు దయ పుట్టె సొంపగు నీ చిత్త మెట్టో
Language

(॥పల్లవి॥)
చూచినారు దయ పుట్టె సొంపగు నీ చిత్త మెట్టో
కాచి నీకు మొక్కె కప్పురగంది

(॥॥)
కూరిమి గొసరె నిన్నుఁ గొచ్చి కొచ్చి ఇందాఁకా
చేరఁడేసి కన్నుల చెలియ
నేరుపుల మాటల నీకుఁ బ్రియములు చెప్పె
సారె వినయముతో జవరాలూ

(॥॥)
వొట్టుక నీ కైలా గిచ్చి వూడిగా లెల్లాఁ జేసె
పట్టెఁడేసి గుబ్బల పడఁతి
నెట్టు కొన్నయాసతోడ నిండు సరసము లాడె
దట్టపు నవ్వులతోడ తగు ముద్దరాలు

(॥॥)
సమ్మతించఁ జేసి నిన్ను సారె సారెఁ గౌఁగిలించె
కమ్ముక మూరెఁడు గొప్పు కలికి
యిమ్ముల శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
నెమ్మి నీ రతి వెలసె నిచ్చ పెండ్లికూతురూ.

(||pallavi||)
sūsināru daya puṭṭĕ sŏṁpagu nī sitta mĕṭṭo
kāsi nīgu mŏkkĕ kappuragaṁdi

(||||)
kūrimi gŏsarĕ ninnum̐ gŏchchi kŏchchi iṁdām̐kā
seram̐ḍesi kannula sĕliya
nerubula māḍala nīgum̐ briyamulu sĕppĕ
sārĕ vinayamudo javarālū

(||||)
vŏṭṭuga nī kailā gichchi vūḍigā lĕllām̐ jesĕ
paṭṭĕm̐ḍesi gubbala paḍam̐ti
nĕṭṭu kŏnnayāsadoḍa niṁḍu sarasamu lāḍĕ
daṭṭabu navvuladoḍa tagu muddarālu

(||||)
sammadiṁcham̐ jesi ninnu sārĕ sārĕm̐ gaum̐giliṁchĕ
kammuga mūrĕm̐ḍu gŏppu kaligi
yimmula śhrī veṁkaḍeśha yīgĕ yalamelumaṁga
nĕmmi nī radi vĕlasĕ nichcha pĕṁḍligūdurū.