చూచిన సతులెల్లాను సొరిది సంతోసించేరు
(॥పల్లవి॥)
చూచిన సతులెల్లాను సొరిది సంతోసించేరు
యేచిన మీ నేరుపులు యెన్నికకు నెక్కెను
(॥చూచి॥)
చెలి చేయెత్తి మొక్కితే చెక్కు నీవు నొక్కితివి
అల మీమోహములు యేమని చెప్పిము
తెలిగన్నులఁ జూచితే తీఁగెలు సాగ నవ్వితిఁ
వెలమి మీ జాణతనా లెట్టు వొగడేము
(॥చూచి॥)
తరుణి కాను కిచ్చితే దండఁ గూచుండు మంటివి
యిరవై నీమంచితనా లేది గొలఁది
సురటి నాపై వీచితే సొమ్ములు నీ విచ్చితివి
సరుస మీ గుణాలు మెచ్చఁగ వసమౌనా
(॥చూచి॥)
కాంత పాదము లొత్తితే కాఁగిలించుకొంటివి
వింత మీరతులు భావించే దెట్టు
యింతలో శ్రీవేంకటేశ యేలితివి మగుమాను
మంతనపు మీమహిమ మరుఁడే యెరుఁగును
(||pallavi||)
sūsina sadulĕllānu sŏridi saṁtosiṁcheru
yesina mī nerubulu yĕnnigagu nĕkkĕnu
(||sūsi||)
sĕli seyĕtti mŏkkide sĕkku nīvu nŏkkidivi
ala mīmohamulu yemani sĕppimu
tĕligannulam̐ jūside tīm̐gĕlu sāga navvidim̐
vĕlami mī jāṇadanā lĕṭṭu vŏgaḍemu
(||sūsi||)
taruṇi kānu kichchide daṁḍam̐ gūsuṁḍu maṁṭivi
yiravai nīmaṁchidanā ledi gŏlam̐di
suraḍi nābai vīside sŏmmulu nī vichchidivi
sarusa mī guṇālu mĕchcham̐ga vasamaunā
(||sūsi||)
kāṁta pādamu lŏttide kām̐giliṁchugŏṁṭivi
viṁta mīradulu bhāviṁche dĕṭṭu
yiṁtalo śhrīveṁkaḍeśha yelidivi magumānu
maṁtanabu mīmahima marum̐ḍe yĕrum̐gunu