Soosidivo soodavo sudadulavamka neevu

చూచితివో చూడవో సుదతులవంక నీవు
Language

(॥పల్లవి॥)
చూచితివో చూడవో సుదతులవంక నీవు
కాచుకొని నేనిన్నియుఁ గనుఁగొంటి నిపుడు

(॥॥)
పానుపుపైఁ బవళించి పడఁతిఁబేరఁబిలిచి
పానిపట్టి పాదాలు పైఁజాఁచితివి
దానికేపో కొలువులో తరుణులు సిగ్గువడి
మోనముతోడుత ముసిముసినవ్వు నగిరి

(॥॥)
గుట్టుననే తమకించి కొమ్మఁగొంగువట్టితీసి
ముట్టి చన్నులపై గోరు మోపితివి
చుట్టిరానున్నసతులు చూచి తమలో లోఁగి
ఱట్టుమీచేఁతకు శిర సట్టె వూఁచుకొనిరి

(॥॥)
కావరపువలపుతో కాంతఁగాఁగిట నునిచి
శ్రీవేంకటేశ నన్నుఁబచ్చిగా నేలితి-
వీవేళ నందరు నన్నునెనసిరి కాతరించి
వేవేలురతులు భావింపుచుఁ బొగడిరి

(||pallavi||)
sūsidivo sūḍavo sudadulavaṁka nīvu
kāsugŏni neninniyum̐ ganum̐gŏṁṭi nibuḍu

(||||)
pānububaim̐ bavaḽiṁchi paḍam̐tim̐beram̐bilisi
pānibaṭṭi pādālu paim̐jām̐sidivi
dānigebo kŏluvulo taruṇulu sigguvaḍi
monamudoḍuda musimusinavvu nagiri

(||||)
guṭṭunane tamagiṁchi kŏmmam̐gŏṁguvaṭṭidīsi
muṭṭi sannulabai goru mobidivi
suṭṭirānunnasadulu sūsi tamalo lom̐gi
ṟaṭṭumīsem̐tagu śhira saṭṭĕ vūm̐sugŏniri

(||||)
kāvarabuvalabudo kāṁtam̐gām̐giḍa nunisi
śhrīveṁkaḍeśha nannum̐bachchigā nelidi-
vīveḽa naṁdaru nannunĕnasiri kādariṁchi
veveluradulu bhāviṁpusum̐ bŏgaḍiri