చూచితిరా చెలులాల సోద్యము లివిఁ గొన్ని
(॥పల్లవి॥)
చూచితిరా చెలులాల సోద్యము లివిఁ గొన్ని
కాచుకొని సంతోసమే కావించీ నాకును
(॥చూచి॥)
చిత్తము రాఁదనకు నే సేవలు సేసేదానను
తత్తరించి కొసరేనా తనతో నేను
యెత్తలఁ జూచిననన్ను నెక్కువగా మన్నించె
హత్తి ఇంతబుజ్జగించి యాదరించవలెనా
(॥చూచి॥)
యెలమి నేపొద్దుఁ దనఇచ్చలోనిదానను
బలిమి వేసరించేనా పైకొని నేను
కలమేలెల్లా నాకె కరుణించినాఁడు నేఁడు
ఇల నేమివలెనని యెట్టడిగీ నన్నును
(॥చూచి॥)
మచ్చికతో నలమేలుమంగనైనదానను
కొచ్చి తమిరేఁచేనా కొత్తగా నేను
యిచ్చట శ్రీవేంకటేవుఁ డేలి న్ను లాలించె
మెచ్చిమెచ్చి కాఁగిలించి మేలమాడె నిపుడు
(||pallavi||)
sūsidirā sĕlulāla sodyamu livim̐ gŏnni
kāsugŏni saṁtosame kāviṁchī nāgunu
(||sūsi||)
sittamu rām̐danagu ne sevalu sesedānanu
tattariṁchi kŏsarenā tanado nenu
yĕttalam̐ jūsinanannu nĕkkuvagā manniṁchĕ
hatti iṁtabujjagiṁchi yādariṁchavalĕnā
(||sūsi||)
yĕlami nebŏddum̐ dana̮ichchalonidānanu
balimi vesariṁchenā paigŏni nenu
kalamelĕllā nāgĕ karuṇiṁchinām̐ḍu nem̐ḍu
ila nemivalĕnani yĕṭṭaḍigī nannunu
(||sūsi||)
machchigado nalamelumaṁganainadānanu
kŏchchi tamirem̐senā kŏttagā nenu
yichchaḍa śhrīveṁkaḍevum̐ ḍeli nnu lāliṁchĕ
mĕchchimĕchchi kām̐giliṁchi melamāḍĕ nibuḍu