చూచితేఁ బిన్నవుగాని సుగుడ(ణ?) వన్నిటా నీవు
(॥పల్లవి॥)
చూచితేఁ బిన్నవుగాని సుగుడ(ణ?) వన్నిటా నీవు
యీ చేత లెన్నఁడు నీవు యెరిఁగితివే
(॥చూచి॥)
వదులుఁదురుము యాల వంచి వంచి మొక్కేవే పతిఁ
నిదివో నయాన నెంత యెలయించేవే
వెదచల్లుఁజూపు లెంతవెదవెట్టేవే
సదరాలనే యెట్టు జట్టిగొంటివే
(॥చూచి॥)
కనుచూపులనే యెంతకమ్ముకొనేవే యీఁ
పనుల నాతని నెంతభ్రమయించేవే
వినయము చూపి యేమి వేఁడుకొనేవేఁ యిట్టిఁ
పెనఁగలాటలనే ప్రియము రేఁచితివే
(॥చూచి॥)
కంచువకుఁ దీసి యెంత కాఁగిలించేవే
యిందునే శ్రీవేంకటేశు నెట్టు గూడేవే
ముందె యీతఁడు నన్నేలె ముచ్చట లేలే
చందమాయఁబనులెల్లా సాదించితివే
(||pallavi||)
sūsidem̐ binnavugāni suguḍa(ṇa?) vanniḍā nīvu
yī seda lĕnnam̐ḍu nīvu yĕrim̐gidive
(||sūsi||)
vadulum̐durumu yāla vaṁchi vaṁchi mŏkkeve padim̐
nidivo nayāna nĕṁta yĕlayiṁcheve
vĕdasallum̐jūbu lĕṁtavĕdavĕṭṭeve
sadarālane yĕṭṭu jaṭṭigŏṁṭive
(||sūsi||)
kanusūbulane yĕṁtagammugŏneve yīm̐
panula nādani nĕṁtabhramayiṁcheve
vinayamu sūbi yemi vem̐ḍugŏnevem̐ yiṭṭim̐
pĕnam̐galāḍalane priyamu rem̐sidive
(||sūsi||)
kaṁchuvagum̐ dīsi yĕṁta kām̐giliṁcheve
yiṁdune śhrīveṁkaḍeśhu nĕṭṭu gūḍeve
muṁdĕ yīdam̐ḍu nannelĕ muchchaḍa lele
saṁdamāyam̐banulĕllā sādiṁchidive