Sooside naamuremgee sudadula kellaanu

చూచితే నామురేఁగీ సుదతుల కెల్లాను
Language

(॥పల్లవి॥)
చూచితే నామురేఁగీ సుదతుల కెల్లాను
పూచిన తంగేడువలె పొదలీ మీ వలపు

(॥చూచి॥)
నిండువావి సేసుకొని నీతో నవ్వీఁ జెలియ
మెండుగాఁజెయిముట్టి మేల మాడీని
కొండలవంటిచన్నులు గురుతు లెరిఁగించీని
దండనే చెప్పఁ గొత్తలు తగినమీ పొందులు

(॥చూచి॥)
కలికితనములనె కాఁపురము సేసీ నీతో
చెల రెఁగి సిగ్గులనే సేసవెట్టీని
నిలువుఁదురుము చూపి నీమనసు గరఁగించీ
తలఁచే మనఁగలరా దండిమీవేడుకలు

(॥చూచి॥)
రంగుమోవితేనెలనే రతులఁజొక్కించీ నిన్ను
కొంగువట్టి కూరుములు కొసరీఁదాను
సంగతిగ శ్రీవేంకటేశ్వర మన్నించితి వీకెఁ
జెంగటనే కానవచ్చె చేఁతల మీపనులు

(||pallavi||)
sūside nāmurem̐gī sudadula kĕllānu
pūsina taṁgeḍuvalĕ pŏdalī mī valabu

(||sūsi||)
niṁḍuvāvi sesugŏni nīdo navvīm̐ jĕliya
mĕṁḍugām̐jĕyimuṭṭi mela māḍīni
kŏṁḍalavaṁṭisannulu gurudu lĕrim̐giṁchīni
daṁḍane sĕppam̐ gŏttalu taginamī pŏṁdulu

(||sūsi||)
kaligidanamulanĕ kām̐puramu sesī nīdo
sĕla rĕm̐gi siggulane sesavĕṭṭīni
niluvum̐durumu sūbi nīmanasu garam̐giṁchī
talam̐se manam̐galarā daṁḍimīveḍugalu

(||sūsi||)
raṁgumovidenĕlane radulam̐jŏkkiṁchī ninnu
kŏṁguvaṭṭi kūrumulu kŏsarīm̐dānu
saṁgadiga śhrīveṁkaḍeśhvara manniṁchidi vīgĕm̐
jĕṁgaḍane kānavachchĕ sem̐tala mībanulu