చూచి వేడుకాయ మాకు సుదతి నీచెలులము
(॥పల్లవి॥)
చూచి వేడుకాయ మాకు సుదతి నీచెలులము
పూచిన రేలాఁ దంగేడు బొసఁగినట్టున్నారు
(॥చూచి॥)
యేపునఁ జెలియ నీవు యేమినోము నోఁచితివో
నీపై బత్తిగలఁడు నీరమణుఁడు
చేపట్టి నీవెటువలె సేవలు సేసితివో
యేపొద్దు దించక నిన్ను నెదఁ బెట్టుకొన్నాఁడు
(॥చూచి॥)
యెనసి యీతని కెంతిఇచ్చకము సేసితివో
ననిచివున్నాఁడు నీనాయకుఁడు
మనసిచ్చి యెటువలె మర్మానఁ జొక్కించితివో
కనుఁగొని నీతోడిదే కాఁపురమై వున్నాడు
(॥చూచి॥)
అలమేలంగవు నీవేమని వరము గొంటివో
వెలమ నిన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు
కలికితనాల నెంత కడఁగి మెప్పించితివో
ఇల నీకుఁ గంకణము ఇదె కట్టుకొన్నాఁడు
(||pallavi||)
sūsi veḍugāya māgu sudadi nīsĕlulamu
pūsina relām̐ daṁgeḍu bŏsam̐ginaṭṭunnāru
(||sūsi||)
yebunam̐ jĕliya nīvu yeminomu nom̐sidivo
nībai battigalam̐ḍu nīramaṇum̐ḍu
sebaṭṭi nīvĕḍuvalĕ sevalu sesidivo
yebŏddu diṁchaga ninnu nĕdam̐ bĕṭṭugŏnnām̐ḍu
(||sūsi||)
yĕnasi yīdani kĕṁtiichchagamu sesidivo
nanisivunnām̐ḍu nīnāyagum̐ḍu
manasichchi yĕḍuvalĕ marmānam̐ jŏkkiṁchidivo
kanum̐gŏni nīdoḍide kām̐puramai vunnāḍu
(||sūsi||)
alamelaṁgavu nīvemani varamu gŏṁṭivo
vĕlama ninnum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
kaligidanāla nĕṁta kaḍam̐gi mĕppiṁchidivo
ila nīgum̐ gaṁkaṇamu idĕ kaṭṭugŏnnām̐ḍu