Soosi soosi samtosimtu sodyamugaa ne neppudu

చూచి చూచి సంతోసింతు సోద్యముగా నే నెప్పుడు
Language

(॥పల్లవి॥)
చూచి చూచి సంతోసింతు సోద్యముగా నే నెప్పుడు
కాచుక న న్నేలేటి చక్కని నా విభుని

(॥॥)
నా తలఁపెఱుఁగునే నన్నిట్టే లాలించునే
యీతని నెట్టు గొసరే నింకా నేను
చేతికి లోనై వుండునే చెప్పినట్టు సేసునే
యీతలఁ దనగుణము లేమని చెప్పుదునే

(॥॥)
సన్నలనే మెలఁగునే చనవు నా కిచ్చునే
విన్నప మేమి సేసేనే వేరే మరియూ
తన్నుఁదానె వచ్చునే తగవులు నెరపునే
యిన్నిటా మెచ్చె నంటే యెంతదాననే

(॥॥)
చెలిమి సేయ జాణఁడే శ్రీ వేంకటేశుఁడే
తెలుప నేలే నా పాలిట దేవరే తాను
అలమేల్మంగనే నేను అన్నిటాను నన్నుఁగూడె
అలవి గాదు పొగడే నంటే నిట్టే మొక్కేనే

(||pallavi||)
sūsi sūsi saṁtosiṁtu sodyamugā ne nĕppuḍu
kāsuga na nneleḍi sakkani nā vibhuni

(||||)
nā talam̐pĕṟum̐gune nanniṭṭe lāliṁchune
yīdani nĕṭṭu gŏsare niṁkā nenu
sedigi lonai vuṁḍune sĕppinaṭṭu sesune
yīdalam̐ danaguṇamu lemani sĕppudune

(||||)
sannalane mĕlam̐gune sanavu nā kichchune
vinnaba memi sesene vere mariyū
tannum̐dānĕ vachchune tagavulu nĕrabune
yinniḍā mĕchchĕ naṁṭe yĕṁtadānane

(||||)
sĕlimi seya jāṇam̐ḍe śhrī veṁkaḍeśhum̐ḍe
tĕluba nele nā pāliḍa devare tānu
alamelmaṁgane nenu anniḍānu nannum̐gūḍĕ
alavi gādu pŏgaḍe naṁṭe niṭṭe mŏkkene